రైతుల ఆందోళనలో విషాదం.. న్యాయవాది ఆత్మహత్య
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, యూపీ రైతులు నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో తాజాగా విషాదం నెలకొంది. రహదారులపై ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వెళ్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయవాది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లా జలాలబాద్‌కు చెందిన న్యాయవాది అమర్జీత్ సింగ్ రైతుల ఆందోళనలో పాల్గొన్న అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
రైతులకు మద్దతుగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లాయర్ అమర్జీత్ సింగ్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజల గోడును వినిపించుకోవాలని కోరారు.
ఇప్పటివరకు రైతుల ఆందోళనకు సంబంధమున్న ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా మరో లాయర్ ఉసురు తీసుకున్నాడు.