టైటానిక్ మునకపై కొత్త కోణం

Update: 2017-01-02 09:34 GMT
వందేళ్ల క్రితం జరిగిన ఘోర విషాదం ఇప్పటికి అందరి మనసుల్ని కలిచి వేయటమే కాదు.. దాని గురించి తరచూ మాట్లాడుకోవటం కనిపిస్తుంటుంది. 1500 మంది సముద్రంలో మునిగిపోయిన ప్రాణాలు పోగొట్టుకున్న అత్యంత విషాద ఘటనపై ఇప్పటికే పలు కథలే కాదు.. సినిమాలు వచ్చాయి. అయితే.. ఇందులో చూపించిన విధంగా.. పెద్ద ఐసు గడ్డను టైటానిక్ భారీ షిప్ మునిగిపోయిందన్నది ఎంతమాత్రం నిజం కాదన్న సంచలన అంశాన్ని చెబుతున్నారు.. ఈ ఘటనపై భారీ ఎత్తున పరిశోధనలు జరిపిన సెనన్ మెలనీ.

ఐర్లాండ్ కు చెందిన ఈ జర్నలిస్ట్ వాదన ఇప్పుడు కొత్త కొత్తగా ఉండటమే కాదు.. టైటానిక్ ప్రమాదంపై సరికొత్త సందేహాలు వచ్చేట్లుగా ఉండటం గమనార్హం. తాజాగా ఆయన టైటానిక్; ది న్యూ ఎవిడెన్స్ అనే డాక్యుమెంటరీని సిద్ధం చేశారు.

ఆయన చేస్తున్న వాదన ప్రకారం.. టైటానిక్ షిప్ ముక్కలై.. మునిగిపోవటానికి కారణం.. బాయిలర్ లో వెలువడిన మంటలే ఈ భారీ నౌకను కాల్చేసిందని చెబుతున్నారు. బొగ్గు కారణంగా.. వెయ్యి డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత విడుదలై.. దానితో షిప్ హల్ బలహీనంగా మారిందని.. దాని ఫలితంగా 75 శాతం బలహీనంగా.. పెళుసుగా మారిన ఉక్కుతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
Read more!

నౌకను తయారు చేసిన సదరు కంపెనీ అధ్యక్షుడు బ్రూన్ ఇస్మేకు విషయం మొత్తం తెలుసని.. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన కామ్ గా ఉన్నారన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తీసిన పలు ఫోటోలలో తాను చెప్పిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని.. అయినప్పటికీ ఈ విషయంపై ఎవరూ దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. పెద్ద ఐసుగడ్డ వల్ల నౌక మునిగిపోయినట్లు చెప్పటం సరికాదని.. టైటానిక్ షిప్ మునిగిపోవటం దేవుడు చేసిన చర్య ఎంత మాత్రం కాదని.. కేవలం నిర్లక్ష్యంతో చోటు చేసుకున్న దారుణంగా అభివర్ణిస్తున్నారు. మరి.. ఆయన డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత ఈ విషయంపై మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News