కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు.. తలరాత మారలేదు

Update: 2020-07-30 10:10 GMT
ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు పట్టున్న జిల్లా ఆ తర్వాత టీఆర్ఎస్ పరమైంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా కారెక్కడంతో ఖాళీ అయిపోయంది.

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రాగానే ఇక కాంగ్రెస్ పై ఆశలు వదిలేసి నేతలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ లు కేసీఆర్ సమక్షంలోనే గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక తమకు మంచిరోజులు వచ్చాయని అనుకున్నారు. కానీ పార్టీ ఫిరాయించినా ఈ నేతల తలరాతలు మారలేదు.

గులాబీ దళపతి కేసీఆర్.. పార్టీ పదవుల్లో కానీ.. నామినేటెడ్ పోస్టుల్లో గానీ ఈ ముగ్గురిని అస్సలు పట్టించుకోవడం లేదట. గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనూ వీరికి సఖ్యత లేదు. వీళ్లను ఎమ్మెల్యేలు కార్యక్రమాలకు పిలవడం లేదట..

దీంతో టీఆర్ఎస్ లో చేరినా కూడా ఈ ముగ్గురికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారంతా గుర్రుగా ఉన్నారు. ఇచ్చిన హామీలు కూడా పెడచెవిన పెట్టడంతో సన్నిహితుల వద్ద వాపోతున్నారట.. కాంగ్రెస్ లోనే ఉంటే బాగుండేదని.. టీఆర్ఎస్ లో చేరి తప్పు చేశామన్న బాధ వారిలో కనిపిస్తోందట..
Tags:    

Similar News