బతకటానికి అవసరమైన ఉద్యోగం గురించి పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. జీవితంలో అత్యధిక భాగం ఉపాధి.. ఉద్యోగం చుట్టూనే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తరచి చూడాలే కానీ.. చుట్టూ బోలెడన్ని ఉద్యోగాలుంటాయి. కొన్ని అయితే.. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా? అన్నట్లుగా ఉండేవి ఉంటాయి. ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిన ఉద్యోగం ఒకటి.
ఎలాంటి పని చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం చెప్పులు వేసుకొని పన్నెండు గంటల పాటు అలా కూర్చొని ఉంటే.. ఉద్యోగం చేసినట్లే. నెల.. నెలా మీ అకౌంట్లు డబ్బులు వేసే ఉద్యోగానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారింది. బెడ్ రూమ్ అథ్లెటిక్స్ అనే సంస్థ 2021 కోసం ఒక మహిళ.. ఒక పురుషుడ్ని అపాయింట్ చేసుకోవటానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సంస్థ తయారు చేసే లేటెస్టు పుట్ వేర్ కు టెస్టర్ గా పని చేయటమే ఈ జాబ్ లక్షణం.అందుకు నెలకు 24 గంటల వ్యవధిలో 12 గంటల పాటు కాళ్లకు వారు తయారు చేసి ఇచ్చే చెప్పులు ధరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏడాదికి రూ.4లక్షల జీతం ఇవ్వనున్నారు.
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి 12 జతల స్లిప్పర్లతో పాటు 12 నెలల కాంట్రాక్టు దక్కుతుంది. నెలలో రెండు రోజులు అందుబాటులో ఉంటే 333 యూరోల జీతం.. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.40వేల వరకు ఉంటుంది. తమ సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్ని వేసుకొని టెస్టు చేయాలని కోరుతున్నారు.
తమ ఫుట్ వేర్ ఎంత కంఫర్ట్ గా ఉందో టెస్టు చేయటం తమకు ఎంతో ముఖ్యమని.. అందుకే ఈ ఉద్యోగాల్ని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. టెస్టర్లుగా ఉండటం వల్ల స్లిప్పర్లను మరెంత మెరుగుపర్చాలో తెలుసుకోవటంతో పాటు.. కొత్త వాటిని తయారు చేసే సమయంలో వారి నుంచి తీసుకునే ఫీడ్ బ్యాక్ తమకు లాభం చేకూరుతుందన్నారు.
ఈ ఉద్యోగాల కోసం పాదాలు తొందరగా చల్లబడతాయో వారికి ఈ ఉద్యోగాలు మరింతగా సూట్ అవుతారని చెబుతున్నారు. తమ కస్టమర్ల పాదాలు వెంటనే వెచ్చదనం ఉండేలా స్లిప్పర్లు తయారు చేయటమే తమ లక్ష్యమని చెబుతున్నారు. భలేగా ఉంది కదా ఈ ఉద్యోగం.