జీవీఎంసీ ఓటర్లు... వెరీ బిగ్ నంబర్ !

ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా జీవీఎంసీ ఉంది. ఓటర్లు కూడా అంతే విధంగా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోకి ఏకంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

Update: 2026-09-22 22:30 GMT

ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా జీవీఎంసీ ఉంది. ఓటర్లు కూడా అంతే విధంగా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోకి ఏకంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే విశాఖ పూర్తిగా అనకాపల్లి జిల్లాలో కొంత భాగం జీవీఎంసీలోకి వస్తుంది. మరో వైపు చూస్తే పునర్ విభజన తరువాత జీవీఎంసీ వార్డుల సంఖ్య కూడా 98 నుంచి 120 గా పెంచారు. దాంతో జీవీఎంల్సీలో ఇపుడు ఓటర్ల సంఖ్య కూడా బయటకు వచ్చింది. మొత్తంగా విశాఖలో ఓటర్ల సంఖ్య 18 లక్షల 29 వేల 966గా అధికారులు లెక్క తేల్చారు.

మహిళలే అధికం :

ఇక ఈ ఓటర్ల జాబితాను చూస్తే 2026 సెప్టెంబర్ 22 నాటికి జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులలో ఉన్న మొత్తం 18 లక్షల 29 వేల 966 మంది ఓటర్లలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు లెక్క తేలింది. వీరిలో 9 లక్షల 27 వేల 676 మంది మహిళా ఓటర్లు ఉంటే, 9 లక్షల 2 వేల 171 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే 119 మంది ఇతర ఓటర్లున్నట్టు అధికారిక వివరాలు తెలియచేస్తున్నాయి. జోన్‌ల వారీగా చూస్తే అత్యధికంగా గాజువాకలో 19 వార్డులతో 2,98,229 మంది ఓటర్లు ఉంటే ఈస్ట్ జోన్‌లో 18 వార్డులతో 2,96,124 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత నార్త్ జోన్ లో 20 వార్డులతో రెండు లక్షల 91 వేల 691 మంది ఓటర్లు ఉన్నారు. సౌత్ జోన్‌లో 16 వార్డులతో 2,17,817 మంది ఓటర్లు ఉంటే సౌత్ జోన్‌లో 16 వార్డులతో 2,17,817 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక అతి తక్కువగా భీమిలి జోన్ లో అయిదు వార్డులకు గానూ 66 వేల 446 మంది ఓటర్లు ఉన్నారు.

ఓటర్ల జాబితా సిద్ధం :

ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజల సమాచారం పరిశీలన నిమిత్తం ప్రచురిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించేందుకు వార్డు స్థాయిలో అధికారుల ద్వారా సర్వే నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా చేపట్టనున్న సర్వేకు అవసరమైన సరైన సమాచారాన్ని సంబంధిత సిబ్బందికి అందించాలని నగర ప్రజలని అధికారులు కోరుతున్నారు.

చక్రం తిప్పనున్న గాజువాక :

ఇక గాజువాక లో దాదాపుగా మూడు లక్షల ఓటర్లు ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో ఇది 18 శాతం అన్న మాట. అలాగే దీని తరువాత విశాఖ ఈస్ట్ జోన్ ఉంది. దీని తరువాత విశాఖ నార్త్ జోన్, విశాఖ సౌత్ జోన్, విశాఖ వెస్ట్ జోన్ ఉన్నాయి. అంటే జీవీఎంసీ ఫలితం మొత్తం విశాఖ కోర్ సిటీ పరిధిలోనే ఉంది అన్న మాట. ఇక్కడ టీడీపీ కూటమికి ఎంతో బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు. గాజువాకలో అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే ఈస్ట్ జోన్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు. ఇలా విశాఖ నాలుగు దిక్కులతో పాటు గాజువాకలో కూటమికి పటిష్టమైన బలం ఉంది కాబట్టి కళ్ళు మూసుకుని మేయర్ సీటుతో పాటు కార్పోరేటర్లను కూడా అత్యధికంగా ఈజీగా గెలుచుకుంటుందని అంటున్నారు.

Tags:    

Similar News