ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అప్డేట్ ఇది
ఒకప్పుడు వర్షం పడుతుందంటే ఆనందం ఉండేది. ఇటీవల వరుస పెట్టి కురిసిన వర్షాల దెబ్బకు.. వానంటే చాలు.. భయం.. ఆందోళన చెందే పరిస్థితి వచ్చేసింది. మొన్నటికి మొన్న అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ కురిసిన వానల కారణంగా ఎదురైన ఇబ్బందులు నేటికి కొనసాగుతున్న వేళ.. మరోసారి వర్షసూచనను చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలకు తోడుగా విరుచుకుపడిన వరదలతో జనజీవనం స్తంభించిన దుస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి వర్షసూచన చేసింది వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా నిష్క్రమిస్తుంటే.. ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్నారు.
మధ్య బంగాళాఖాతం దాన్ని అనుకున్న ఆగ్రేయ బంగాళాఖతంలో 1.5కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో.. రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రంలో ఎక్కువగా.. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే వీలుంది. సో.. జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.