డిజిటల్ మీడియాను సైలెంట్ చేసిన టీడీపీ!

ఫలితంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులే పడుతున్నాయి. నిజానికి ఈ రెండేళ్ళ కాలంలో ఎన్నో సవాళ్ళూ మరెన్నో చాలెంజెస్ కూడా కూటమి ప్రభుత్వం ఎదుర్కొంది.;

Update: 2026-04-20 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అంటేనే వ్యూహాలకు పుట్టినిల్లు అని చెబుతారు. నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన టీడీపీ ఈ రోజుకీ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది అంటే దానికి అధినాయకత్వం గొప్పదనం ఎంతగానో ఉంది. చంద్రబాబు సారధ్యంలో టీడీపీ సరికొత్త తీరులో ఎప్పటికప్పుడు సాగుతోంది. కాలానికి అనుగుణంగా తన విధానాలలో మార్పు చేసుకుంటూ ముందుకు సాగడం టీడీపీ స్పెషాలిటీ.

మెయిన్ స్ట్రీమ్ మీడియాతో :

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో కలసి ప్రయాణించింది. తెలుగుదేశం పార్టీ ఏమి చేసినా విస్తృతంగా ప్రచారం అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లభించింది. అయితె ప్రస్తుతం అంతా డిజిటల్ మీడియా శకం. సోషల్ మీడియా యుగం. ఎవరి ఆధిపత్యంలోనూ డిజిటల్ మీడియా ఉండదని అంటారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సోషల్ మీడియాలో అంతా జర్నలిస్టులే అన్నది కూడా తెలుసు. సోషల్ మీడియా వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేది రాజకీయ రంగమే. అధికారంలో ఉన్న పార్టీలు అంతే సోషల్ మీడియా గురి తప్పకుండా అటే ఉంటుంది. అదే అతి పెద్ద ఇబ్బందిగా కూడా ఉంటుంది.

శాసిస్తున్న వేళలో :

గట్టిగా చెప్పాలీ అంటే సోషల్ మీడియా ఈ రోజున ప్రపంచాన్ని శాసిస్తోంది. అలాగే డిజిటల్ మీడియా యుగం పెద్ద ఎత్తున నడుస్తోంది. డిజిటల్ మీడియా ప్రభావం చాలా అధికంగా ఉంది. ఏ చిన్న విషయం అయినా డిజిటల్ మీడియాలో బిగ్ సౌండ్ చేస్తుంది. అది పాజిటివ్ గా కంటే నెగిటివ్ గా ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ. అలాంటి డిజిటల్ మీడియాను సైతం చక్కగా హ్యాండిల్ చేయడంలోనే టీడీపీ సక్సెస్ దాగుంది అని అంటున్నారు. సోషల్ మీడియాను కూడా టీడీపీ బాగా నడిపిస్తుంది అని చెబుతారు.

వైరల్ అయితే అంతే :

ఏది నిజం ఏది అబద్ధం అన్నది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఏదైనా వస్తే చాలు అది తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. దాంతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకే ఎక్కువగా ముప్పు వస్తుంది. ఒక విధంగా ఇమేజ్ కూడా ఇబ్బందులో పడుతుంది. ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడం బహు కష్టం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు డిజిటల్ మీడియా తాకిడికి గురి అయి ఇరకాటంలో పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే టీడీపీ మాత్రం డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫారాలను పూర్తిగా హ్యాండిల్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది అని అంటున్నారు.

పాజిటివ్ వైబ్రేషన్స్ :

ఈ రోజున తామర తంపరగా డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫారాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడ నుంచి నడిపినా రాజకీయాల మీద తమ అభిప్రాయాలను కానీ లేదా ఆలోచనలు కానీ అందులో పెడుతూ ఉంటారు. ఒక విధంగా నెగిటివిటీ అయితే ప్రభుత్వాల మీద ఎక్కువగా వచ్చేలా డిజిటల్ మీడియాలో వార్తా కధనాలు వస్తూంటాయి. కానీ అదేమి తమాషానో తెలియదు కానీ టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్న వేళ డిజిటల్ మీడియా ప్రపంచం అంతా దాదాపుగా పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే ముందుకు సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం విషయంలో ఇది అత్యంత సానుకూల అంశంగా చెప్పుకోవాలని అంటున్నారు. డిజిటల్ మీడియా అయితే ఒక విధంగా ఫుల్ సైలెంట్ గా ఉంచడంతో టీడీపీ సక్సెస్ అయింది అని అంటున్నారు.

మంచి మార్కులే :

ఫలితంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులే పడుతున్నాయి. నిజానికి ఈ రెండేళ్ళ కాలంలో ఎన్నో సవాళ్ళూ మరెన్నో చాలెంజెస్ కూడా కూటమి ప్రభుత్వం ఎదుర్కొంది. అలాగే ఇబ్బందులు కూడా ఉన్నాయి. సమస్యలు విషయం చెప్పాల్సింది లేదు. కానీ డిజిటల్ మీడియాను టీడీపీ చక్కగా హ్యాండిల్ చేయడం వల్ల ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సహకారం ఆ వైపు నుంచి అందుతోంది అని అంటున్నారు. దీనికి టీడీపీ చూపే చొరవే కారణం అని అంటున్నారు. డిజిటల్ మీడియా కనుక వేరే తీరుగా ఉంటే వచ్చే వార్తలు కధనాలతో తెగ వైరల్ అయ్యేది. కానీ ఆ పరిస్థితి తలెత్తకుండా టీడీపీ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. మొత్తం మీద అవ్యవస్థగా ఉన్న డిజిటల్ మీడియాను సైతం తమకు అనుకూలంగా మలచుకోవటంలో టీడీపీ నేర్పును తప్పక అభినందించాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News