వాలంటీర్ కళ్లలో కారం కొట్టి పించన్ సోమ్ము ఎత్తుకెళ్లారు!
అనంతపురం జిల్లాలోని మడకశిర పట్టణం శివాపురంలో వాలంటీర్ పై దాడి కలకలం సృష్టిస్తుంది. పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వాలంటీర్ ని కొట్టి వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్న డబ్బును తీసుకోని పారిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మడకశిర పట్టణంలోని శివపురకి చెందిన వాలంటీర్ వీరప్ప ఈ రోజు ఉదయం వృద్ధులకు పంపిణీ చేసేందుకు పింఛన్ల సొమ్మును తీసుకెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, డబ్బుని తీసుకెళ్లారు. వాలంటీర్ కళ్లలో కారం కొట్టి రూ. 43 వేల రూపాయలు దోచుకెళ్లారు. తీవ్రంగా కొట్టడంతో వాలంటీర్ గాయాలపాలైయ్యాడు.
దీనితో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డబ్బు కాజేసిన దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, పక్కాగా తెలిసిన వాళ్లే దాడి చేసి డబ్బులు దోచుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అయినా, వృద్ధులకు పంపిణీ చేసే పింఛన్ సొమ్మును దోచుకుపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.