మన మధ్య ఇలాంటోళ్లు ఉంటారు.. అసహ్యంగా ఉంటుందని వీడియో పోస్టు చేయట్లేదు
వినేందుకే కొన్ని ఉదంతాలు చాలా వికారంగా ఉంటాయి. అలా అని వాటి గురించి తెలుకోకపోతే.. అనుకోని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మన చుట్టూ మనుషుల రూపంలో ఉండే కొందరు.. రూపంలోనే మనుషులే తప్పించి మిగిలినవేవీ ఆ లక్షణాలు ఉండవు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. ముందస్తు జాగ్రత్తలో భాగంగా.. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేయటం లేదు.
సంచలనం కోసమో.. మరో తాపత్రయం లేదు. అందుకే విషయాన్ని ఎక్కువగా సాగదీయకుండా.. సూటిగా.. సింఫుల్ గా చెప్పేయదలుచుకున్నాం. ఇప్పుడు దేశంలో కరోనా కారణంగా పెద్ద ఎత్తున మరణిస్తున్నారు. కేంద్రం చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం రోజు గడిచేసరికి దేశ వ్యాప్తంగా కరోనాతో దగ్గర దగ్గర మూడున్నర వేల మంది మరణించారు. ఇలా మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద కష్టం గామారింది. శశ్మానాలు నిండిపోవటంతో కొంతమంది ఫుట్ పాత్ లమీద కూడా దహన సంస్కారాలు చేస్తున్న నగరాలు దర్శనమిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కోలకి గ్రామ పంచాయితీ శ్మశాన వాటికలో ఒక యువకుడు కనిపించాడు. కరోనాతో చనిపోయిన వారిని దహన సంస్కారాలు జరుగుతున్న వాటిల్లో కొన్ని శవాలు సగం కాలిన తర్వాత.. వాటిని పీక్కు తింటున్న వైనాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. వెంటనే.. ఈ విషయం గురించి స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఈ ఉదంతంపై తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.
అధికారులు రంగంలోకి దిగేసరికి.. ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే.. అతడి వివరాల్ని గుర్తించలేకపోతున్నారు. మత స్థితిమితం లేదని భావిస్తున్నారు. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు.. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి సాయంత్రానికి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదన్న విషయాన్ని గుర్తించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది కానీ.. ఇలాంటి వికార ఉదంతాలు పోస్టు చేయటం ఇష్టం లేక వీడియోను షేర్ చేయటం లేదు. అందుకే.. అపరిచతులతో జాగ్రత్తగా ఉండటంతో పాట.. అప్రమత్తత చాలా అవసరం అన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది.