డ్రైవర్ లేకుండా పరుగులు పెట్టనున్న రైలు .. మోడీ చేతుల మీదుగా నేడే ప్రారంభం !
మన దేశంలో రైళ్లు నడవాలంటే లోకో పైలట్ కచ్చితంగా ఉండాల్సిందే. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రైవర్ లెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. కానీ భారత్ లో మాత్రం అలాంటి ఫుల్లీ ఆటోమెటెడ్ డ్రైవర్ లెస్ ట్రైన్ ఇప్పటి వరకు లేదు. కానీ సోమవారం నుంచి అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ డ్రైవర్ రహిత రైలును ఢిల్లీలో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన చేతుల మీదుగా ఈ హైటెక్ ట్రైన్ ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ లో డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని మోడీ పచ్చజెండా ఊపనున్నారు. ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్‌లో పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సేవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చింది. దేశ రాజధానిలో మొదటి డ్రైవర్ లేని రైలు 37 కిలోమీటర్లు ప్రయాణించబోతోంది. డ్రైవర్ లేని రైలు పూర్తిగా ఆటోమేటిక్ గా ఉంటుందని, మానవ తప్పిదాల అవకాశాన్ని తగ్గిస్తుందని పిఎంఓ తెలియజేసింది.
ఈ మెట్రో రైలులో హై రిజల్యూషన్ కెమెరాలు, రిమోట్ హ్యాండ్లింగ్, రియల్ టైమ్ మానిటరింగ్ రైలు పరికరాలతో అత్యవసర అలారం మరియు హైటెక్ సౌకర్యాలు ఉంటాయి. డ్రైవర్ లేని మెట్రో రైలు ప్రయాణం ఢిల్లీ-ఎన్ సీఆర్ నివాసితులకు సౌకర్యంగా ఉంటుందని డీఎంఆర్ సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ తెలిపారు. ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ లో డ్రైవర్ లేని రైలును ప్రవేశపెట్టిన తర్వాత ఈ రైలును పింక్ లైన్‌లో నడపాలని యోచిస్తున్నారు. నివేదిక ప్రకారం, 2021వరకు లైన్‌లో 57 కిలోమీటర్ల డ్రైవర్ లెస్ మెట్రోను నడపాలని DMRC యోచిస్తోంది. కమాండ్ సెంటర్లలో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తో పాటు క్రౌడ్ మానిటరింగ్ను ఇన్ఫర్మేషన్ కంట్రోలర్స్ హ్యాండిల్ చేస్తాయి. సీసీ టీవీ సాయంతో ట్రైన్ ఎక్విప్‌మెంట్ మొత్తాన్ని రియల్ టైమ్‌లో రోలింగ్ కంట్రోలర్స్ మానిటర్ చేస్తాయి. డ్రైవర్ లెస్ ట్రైన్ సిస్టమ్ ను పరిశీలించడంతో పాటు నిరంతర సమీక్ష కోసం ఓ కన్సల్టెంట్ తో పాటు సిస్ట్రా ఎంవీఏ, సిస్ట్రా ఫ్రాన్స్ నేతృత్వంలోని కన్సార్షియంని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నియమించింది.