తల్లి మృతదేహాన్ని ఫుట్ పాత్ పై పడేసిన కసాయి కొడుకు !
చేతిలో అణా పైసా కూడా లేదు.. చుట్టాలకు చెప్పినా స్పందిస్తారనే ఆశ అసలే లేదు. ఒకవైపు ఇంటి ఓనర్, చుట్టుపక్కలవారి వేధింపులు.. మరోవైపు ఏం చేయాలో పాలుపోని స్థితి. దీం తో ఓ వ్యక్తి తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక పుట్ పాత్ మీద మృతదేహాన్ని వదిలేసిన సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లో వెలుగులోకి వచ్చింది. ఆ మూటను చూసిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి ఆ సంచిని తెరచి చూడగా అందులో ఒక వృద్ధురాలి మృతదేహం ఉంది. ఆ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
పూర్తి వివరాలు చూస్తే .. నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన భగీరథికి ఇద్దరు కొడుకులు , ఒక కూతురు. నిజామాబాద్ లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పెద్ద కుమారుడు దత్తు వద్ద ఆమె ఉండేది. అతడి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తన చిన్న కొడుకు రమేశ్ వద్దకు వారం క్రితం వచ్చి ఉంటుంది. కుటుంబ కలహాల వల్ల రమేశ్ భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆరు నెలల క్రితమే వెళ్లిపోయింది. రమేశ్ బంజారాహిల్స్ లోని షాంగ్రిల్లా ప్లాజాలో వాచ్ మన్. నెల క్రితం బంజారాహిల్స్ లోని షౌకత్ నగర్ లో గదిని అద్దెకు తీసుకున్నాడు. వారం క్రితం తన తల్లిని గదికి తీసుకొచ్చాడు. కానీ, ఆమె అప్పటికే జ్వరంతో బాధపడుతోంది. ఐదురోజులుగా పలు రకాల మాత్రలు ఇస్తున్నప్పటికీ జ్వరం తగ్గకపోగా మరింత తీవ్రమైంది. దీంతో ఓనర్‌తోపాటు చుట్టుపక్కల వారు ఆమెకు కరోనా వచ్చి ఉంటుందేమో అంటూ పలు రకాలుగా ప్రశ్నలతో వేధించేవారు. ఇంతలోనే శనివారం అర్ధరాత్రి ఆమెకు శ్వాస ఆడటం ఆగిపోయింది.
దీనితో ఏం చేయాలో రమేశ్‌కు అర్థం కాలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కరోనా అంటే ఊళ్లోకి కూడా రానివ్వరు. ఇక్కడ కూడా అంత్యక్రియలు చేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని చుట్టాలకు చెప్పినా ఎవరూ సహకరించారేమో అని ఎక్కడైనా వదిలేస్తే ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందనుకొని దుప్పటితో తన తల్లిని చుట్టేసి ముఖానికి గోనె సంచి తగిలించి బంజారాహి ల్స్ రోడ్ నంబర్ 2లోని లుంబినీ మాల్ ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ మీద పడేసి వెళ్ళిపోయాడు.