ఐరోపాలో సంచలనం రేపుతున్న టీచర్ హత్య

Update: 2020-10-18 03:50 GMT
ఫ్రాన్స్‌లో జరిగిన ఒక ఉపాధ్యాయుడి హత్య ఇప్పుడు ఐరోపా అంతటా సంచలనం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. #parrisbeheading పేరుతో నిన్నట్నుంచి ఒక హ్యాష్ ట్యాగ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఒక ముస్లిం వ్యక్తి ఆ టీచర్‌ను హత్య చేసి చంపేశాడన్నది ఆరోపణ. ఆ హంతకుడిని కూడా పోలీసులు కాల్చి చంపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ హత్యకు దారి తీసిన కారణల గురించి పోలీసు వర్గాలు చెబుతున్న వివరాల్లోకి వెళ్తే..

ఓ స్కూల్లో చరిత్ర పాఠాలు బోధించే ఆ టీచర్.. ఇటీవల ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ మీద క్లాస్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా మహ్మద్ ప్రవక్త మీద వచ్చిన క్యారికేచర్ల గురించి వివరించే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా తరగతిలో ఎవరైనా ముస్లిం విద్యార్థులు ఉన్నారా అని అడిగి, వారు ఇబ్బంది పడేలా ఉంటే బయటికి వెళ్లిపోవచ్చని కోరాడు. సదరు విద్యార్థులు వెళ్లిపోయారు. మిగతా విద్యార్థులకు అతను ప్రవక్త మీద వచ్చిన క్యారికేచర్ల గురించి వివరించాడు.
Read more!

ఐతే ముస్లిం విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లి దీని గురించి చెప్పారు. తర్వాత ఆ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి యాజమాన్యాన్ని దీని గురించి నిలదీశారు. ఐతే వారితో సమావేశమైన యాజమాన్యం సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఆ సమావేశం ప్రశాంతంగానే సాగిపోయింది. కానీ తర్వాత ఒక ముస్లిం విద్యార్థి తండ్రి సదరు టీచర్ మీద దాడి చేసి అతడి ప్రాణాలు తీశాడు. ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ హంతకుడిని కాల్చి చంపినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.
Tags:    

Similar News