• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికాలో కనీస ఉపాధి లేని...

అమెరికాలో కనీస ఉపాధి లేని పట్టణం ఇదేనట..

By - Tupaki Desk
Update: 2019-02-14 08:04 GMT
అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఒకటి. కానీ అలాంటి దేశంలో కూడా అత్యంత పేదరికంలో మగ్గుతున్న ఓ పట్టణం ఉంది. తలసరి ఆదాయం దీన స్థితిలో ఉండడంతో ఇక్కడి పౌరులు కనీస ఆహారం లేక అలమటిస్తున్నాయి. అమెరికా -మెక్సికో దేశాల సరిహద్దులో ఉన్న టెక్సాస్ రాష్ట్రంలోని  ఇస్కోబారెస్‌ అనే పట్టణంలో వెయ్యికి పైగా జనాభా ఉన్నారు. అమెరికాలో 1000కు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో పేదరికం అత్యధికంగా ఉన్న పట్టణం ఇస్కోబారెస్ అని అమెరికా ప్రభుత్వం తాజా అధికారిక లెక్కల్లో పేర్కొంది. ఈ పట్టణంలో 62 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. దీంతో అమెరికాలోని అత్యంత పేదరిక పట్టణంగా ఇస్కో బారెస్‌ పేరొందింది.

'చెత్త వేరడం నేను చిన్న పనిగా భావించడం లేదు.. ఇదే నాకు పెద్ద ఉపాధి' అని ఓ అమెరికన్ నిరుద్యోగ యువకుడు పారిశుధ్య కార్మికుడిగా కూడా చేరడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.  అయితే ఈ పట్టణంలో ఇలాంటి పరిస్థితి రావడానికి ఉపాధి లేకపోవడమే కారణమంటున్నారు. ఉపాధి అవకాశాలు లేక తామంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నామని మెజార్టీ నిరుద్యోగులు చెబుతున్నారు.. అలాగే భవిష్యత్తుపై తమకు ఎలాంటి ఆలోచన లేదని పేర్కొంది.

అలాగే ఇక్కడ నేరాలు కూడా ఎక్కువే. మెక్సికోకు సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణం మాఫియాకు కేంద్రంగా ఉంది. ఒకరినొకరు హత్య చేసుకోవడం కామన్‌ గా జరుగుతుంటుందని స్థానికులు చెబుతున్నారు.  దీంతో తలసరి ఆదాయం కంటే నేరాల శాతం ఎక్కువగా పెరుగుతుందని అంటున్నారు. ఒకప్పుడు ఈ పట్టణం దేశాల సరిహద్దుగా ఉండేది కాదు.

2005లో ఇస్కోబారెస్‌ కు పేదరిక పట్టణంగా తొలి గుర్తింపు వచ్చింది. మెక్సికో దేశ ప్రాబల్యం కారణంగా ఈ పట్టణంపై  ఆంక్షలు పెరిగాయి. ఇరుదేశాల మధ్య పెట్టే ఆంక్షలతో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని డిప్యూటీ మేయర్‌ రూపర్టో వివరించారు. పట్టణానికి గుర్తింపు వచ్చినా పెద్దగా అభివృద్ధి సాధించిందేమీ లేదని తెలిపారు.


Tags:    
  • USA News 
  • Escobares 
  • Telugu News 
  • The Most Poor Town In USA 
  • Latest Updates 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS