అత్యంత ఖరీదైన నగరమేదో తెలుసా ?

Update: 2023-03-22 21:00 GMT
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరమేదో తెలుసా ? న్యూయార్క. అవును అమెరికాలోని న్యూయార్క్ నగరమే బిజినెస్ పర్యటనల విషయంలో మిగిలిన అన్నీ నగరాలను పక్కకు నెట్టేసింది. కోవిడ్ మహమ్మారి తర్వాత అనేక రంగాల్లో లివింగ్ స్టైల్ చాలా ఖరీదైపోయిందట. ప్రపంచలోని అత్యంత ఖరీదైన నగరాల్లో జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసే ఒక సంస్ధ ఈ విషయాన్ని వెల్లడించింది. కోవిడ్ తర్వాత వ్యాపార ప్రయాణాల రీత్యా దాదాపు 8 శాతం ఖర్చులు పెరిగిపోయిందని సందరు సంస్ధ లెక్కేసింది.

న్యూయార్క కు బిజినెస్ పనిమీద వచ్చేవాళ్ళు నాలుగు నక్షత్రాల హోటళ్ళల్లో దిగాలన్నా, భోజనం చేయాలన్నా, ఒకచోట నుండి మరోచోటికి ప్రయాణం చేయాలన్నా రోజుకు సుమారు 800 డాలర్లు ఖర్చుచేస్తున్నట్లు సదరు సంస్ధ తెలిపింది.  800 డాలర్లంటే మన కరెన్సీలో సుమారు 66 వేల రూపాయలు.

న్యూయార్క్ తో పాటు అమెరికాలోనే ఉన్న వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో తో పాటు స్విట్జంర్లాండ్ లోని జెనీవా, జ్యూరిచ్ లాంటి నగరాలు కూడా అత్యంత ఖరీదైనవిగా తేలిందట.

ఇక జపాన్లోని టోక్యో, చైనాలోని  బీజింగ్, ఇండియాలోని ముంబాయ్ లాంటి నగరాలు కూడా అత్యంత ఖరీదైన నగరాలుగా రేసులో దూసుకుపోతున్నాయి.

ఇక లండన్, ప్యారిస్ తో పాటు ఆసియా ఖండంలో హాంకాంగ్ కూడా ఖరీదైన నగరాలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవటమే లైఫ్ స్టైల్ పెరిగిపోవటానికి ప్రధాన కారణంగా సదరు సంస్ధ అధ్యయనం తేల్చింది. కొన్ని నగరాల్లో రోజువారి ఖర్చులు సుమారు 530 డాలర్లుగా రికార్డయ్యాయట.

ఖర్చులు పెరిగిపోవటం, జీవన వ్యయం బాగా ఖరీదైపోవటం లాంటివి వదిలేస్తే జనాల సంతృప్తస్ధాయి మాత్రం పై నగరాల్లో కనబడటంలేదట. చాలా హ్యాపీగా బతుకుతున్న జనాలను తీసుకుంటే నార్వే, స్వీడన్ లోనే ఎక్కువమంది ఉన్నట్లు మరో అధ్యయనం చెబుతోంది. పై రెండు దేశాల్లో జీవన వ్యయాలు అత్యంత ఖరీదైనవి కావు. కానీ జనాలు తమ రోజువారి జీవనంలో చాలా హ్యాపీగా జీవిస్తున్నట్లు అధ్యయనాలు తేల్చాయి.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News