రంగుమారిన సముద్రం నీళ్లు ..కారణం ఇదే !

Update: 2020-04-30 02:30 GMT
కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్ డౌన్ విధించారు. కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఇక నిత్యం జనాలతో కిటకిటలాడే బీచ్ లు కూడా ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఎవరూ కూడా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో బీచ్ లు బోసిపోతున్నాయి.

సముద్రాలు కలుషితం కావడం లేదు. దీంతో అరుదైన జీవజాతులు సముద్రంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఎప్పుడు బయటకురాని డాల్ఫీన్ వంటి జీవులు కూడా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాయి.  ఈ  విషయం పక్కన పెడితే ..  మెక్సికో లోని అకాపుల్కో బీచ్ లో ఓ అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సముద్రంలోని నీరు నీలి రంగులో మెరిసిపోతూ కనిపించింది.  ఈ అరుదైన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.  ఈ ఇలాంటి దృశ్యం ఇప్పటి వరకు చూడలేదని, దీనికి కారణం ఏంటో తెలియడం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. అయితే, సముద్రంలో కాలుష్యం తగ్గిపోవడంతో కొన్ని రకాల జీవరసాయన చర్యల వలన ఇలా మెరిసి పోయే రంగులు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
Tags:    

Similar News