చేతులు ఎత్తేసిన మోడీ.. కొవిడ్ మరణాలకు పరిహారం ఇవ్వలేరట

Update: 2021-06-20 10:44 GMT
ఏడేళ్లు అప్రతిహతంగా సాగుతున్న మోడీ జైత్రయాత్రకు కరోనా బాగానే దెబ్బ తీసింది. అప్పటివరకు ఆయనో తిరుగులేని నేతగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఆయన నిలిచారు. చివరకు ఆయన తీసుకున్న నిర్ణయాల్ని వేలెత్తి చూపించే ధైర్యం కూడా చేయలేకపోయారు. విమర్శించేందుకు వెనక్కి తగ్గినపరిస్థితి. అలాంటి మోడీపై ఇటీవల కాలంలో విమర్శల మోత మోగిపోతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటివేళ.. కొవిడ్ కారణంగా మరణించిన బాధిత కుటుంబాల వారికి రూ.4లక్షలు చొప్పున పరిహారం ఇవ్వలేమన్న విషయాన్ని తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకు చెప్పేయటం సంచలనంగా మారింది.

ఒకవేళ మరణించిన ప్రతి కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ఇస్తే.. విపత్తు సహాయ నిధుల మొత్తం వాటికే కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. కొవిడ్ కారణంగా మరణించిన కుటుంబాలకు పరిహారం అందించాలంటూ దాఖలైన పిటీషన్ పై కేంద్రం తన వాదనను కౌంటర్ రూపంలో దాఖలు చేసింది. అందులో పరిహారాన్ని చెల్లించలేమని తేల్చి చెప్పేసింది.

పరిహారాన్ని పంచటం మొదలు పెడిత కొవిడ్ విరుచుకుపడే సమయంలో అత్యవసర వైద్య సేవలు.. పరికరాలు.. సమకూర్చుకోవటం చేయలేమన్నారు. తుపానులు.. వరదలు వచచినప్పుడు వాటిని ఎదుర్కొంనేందుకు నిధులు ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్రాల వద్ద కూడా డబ్బులు ఉండవని చెప్పారు. ప్రస్తుతానికి కరోనాతో దేశంలో మరణించిన వారి సంఖ్య 3.86లక్షలు కాగా.. రోజువారీగా 1500 మంది మరణిస్తున్నారు. దీంతో.. ఇంత భారీగా పరిహారం ఇవ్వటం ఆచరణ సాధ్యం కాదని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలోని మోడీ సర్కారు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేయటం ఖాయమంటున్నారు.




Tags:    

Similar News