చొచ్చుకొచ్చేస్తున్న డ్రాగన్
పొరుగునున్న డ్రాగన్ తో మనకు ఎప్పటికైనా సమస్య తప్పదని తాజా సంకేతాలు నిర్ధారణ చేస్తున్నాయి. ఇంతకాలం జమ్మూ-కాశ్మీర్ లోని లడ్డాఖ్ ప్రాంతంలో మాత్రమే ఆక్రమణలకు సాహసిస్తున్న చైనా తాజాగా తన రూటు మార్చింది. రెండు దేశాల మధ్య ఉన్న వేలాది కిలోమీటర్ల సరిహద్దును అక్కడక్కడ ఉల్లంఘిస్తున్న విషయం జనాలందరికీ తెలిసిందే. తాజాగా లడ్డాఖ్ ప్రాంతంలోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి కూడా కబ్జాలకు డ్రాగన్ ప్లాన్ చేస్తోంది.
అవసరమైతే లడ్డాఖ్ లో సైనిక చర్యలకు రెడీ అవుతున్న డ్రాగన్ ఇదే పద్దతిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సరిహద్దులో కూడా తన స్ధావరాలను బలోపేతం చేసుకోవటానికి రెడీ అయిపోతోంది. లడ్డాఖ్ ప్రాంతంలో ఇపుడున్న 50 వేలమంది సైనికులకు అదనంగా మరో 15 వేలమందిని రంగంలోకి దింపింది. ఇది సరిపోదన్నట్లు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లోని తన భూభాగంలోకి భారీ ఎత్తున సైనికులను దింపేస్తోంది.
ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను విస్తరించటం, కొత్తగా ఎయిర్ స్ట్రిప్పులను నిర్మించటం, యుద్ధ ట్యాంకులను తరలించటం, యుద్ధ హెలికాప్టర్లను మొహరించటం, ఆయుధాలను నిల్వ ఉంచుకోవటానికి పెద్ద పెద్ద బంకర్లను ఏర్పాటు చేసుకోవటం లాంటి చర్యలను యుద్ధ ప్రాతిపదకన చేసేస్తోంది. డ్రాగన్ కదలికలను చూస్తుంటే ఏదో ఓ సందర్భం చూసుకుని భారత్ ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఏకకాలంలో అన్నీ వైపుల నుండి దాడులు చేయటానికి రెడీ అవుతున్నట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అయితే చైనా సైనిక కదలికలన్నింటినీ భారత్ జాగ్రత్తగా కంట కనిపెడుతునే ఉంది. డ్రాగన్ కు ధీటుగా మన సైనికులు కూడా భారీఎత్తున మోహరిస్తున్నారు. యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, విమానాలను భారత్ కేంద్రకరించింది. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ప్రస్తుత వాతావరణం చైనా కన్నా భారత్ కే అనుకూలంగా ఉంటుంది. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే డ్రాగన్ పాలకులు ధైర్యంగా ముందుకు అడుగు వేయలేకపోతున్నారు.