జగన్ పై హోరెత్తిన ప్రచారం.. అదే అధికారానికి రాచమార్గం
పదేళ్ల పాటు నిరంతరం శ్రమ.. అధికారమే లక్ష్యం.. ప్రజలకు మంచి చేయడమే ధ్యేయం.. ఒకటే లక్ష్యం.. ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోవడమే. రాజన్న స్వర్ణ యుగం తీసుకురావడమే. ఎన్నికష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా.. ఎన్ని వేధింపులు ఉన్నా.. ఎందరు కలిసొచ్చినా చిరునవ్వుతో ఆహ్వానించడమే. అందుకే సుదీర్ఘ యాత్రలు, కార్యక్రమాలు చేసి ప్రజల్లో నిరంతరం ఉన్నారు. ఇంతలా కష్టపడుతున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సామాజిక మాధ్యమాలు అండగా నిలిచాయి. పార్టీ తరఫున, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తించారు. జగన్ మాట.. పాట.. ఆటలతో నిరంతరం ప్రజలకు తెలిసేలా ఒక టీమే పని చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది.
అప్పటి పాలకపక్షం చేస్తున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పూరబడుతూనే.. జగన్ వస్తే ఏం చేస్తాడు.. పాలన ఎలా ఉంటుందో వివరంగాతెలిపేలా సోషల్ మీడియాను వినియోగించుకున్నారు. అధికార పక్షం చేసిన ప్రతి తప్పును ప్రశ్నిస్తూ.. ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జగన్.. వైఎస్సార్సీపీపై అభిమానం పెరిగేలా కృషి చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఆ విభాగం చేసిన నినాదాలు.. పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బై బై బాబు.. నిన్ను నమ్మం బాబు వంటి డైలాగ్‌లు ప్రజలకు విపరీతంగా నచ్చాయి. ఈ సందర్భంగా వాటిపేరిట హ్యాష్ ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి.
ఇక జగన్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ రావాలి జగన్.. కావాలి జగన్ నినాదాన్ని హోరెత్తించారు. నినాదాల రూపంలో.. పాటల రూపంలో తీసుకొచ్చారు. ఈ పాట.. మాట కూడా ప్రజల్లో తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఇక తెలంగాణ యాసలో అద్భుతంగా పాటలు పాడే మంగ్లీతో పాడించిన పాట ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగింది. ఆమెతో పాటు మరికొందరు గాయనీగాయకులతో పాడించి ప్రజలకు అవగాహన కల్పించేలా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం చర్యలు తీసుకుంది. గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొడుతూ.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పాలన విధానాలను ఎత్తిపొడుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియా అంతా వైఎస్సార్సీపీ, జగన్ పైనే విస్తృత ప్రచారం చేశారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉండడానికి ఒక కారణంగా నిలిచింది. మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలై వైఎస్సార్సీపీ ఘన విజయం సందర్భంగా ఇది చర్చకు వచ్చింది.