• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముంబై ఓటమికి కారణం అదే..!...

ముంబై ఓటమికి కారణం అదే..! రోహిత్​పై సెహ్వాగ్​ ఫైర్​..!

By - Tupaki Desk
Update: 2021-04-25 02:30 GMT
మాజీ క్రికెటర్​, డ్యాషింగ్​ ఓపెనర్​ వీరేంద్రసెహ్వాగ్​ ముంబై జట్టుపై మండిపడ్డారు. నిన్న పంజాబ్​ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. నిన్నటి మ్యాచ్​ లో ముంబై బ్యాట్స్​మెన్స్​ దారుణంగా విఫలమయ్యారు. ఇటు ఓపెనర్లు, అటు మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్లు ఎవరూ సరిగ్గా ఆడలేదు. దీంతో ముంబై జట్టు చాలా తక్కువ స్కోర్​ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 131 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్కోరును పంజాబ్​ కింగ్స్​ అలవోకగా ఛేదించింది. కేవలం ఒక వికెట్​ నష్టానికి 17 ఓవర్లు పూర్తి కాక ముందే గెలుపొందారు.

అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్​ బ్యాటింగ్​ ఆర్డర్​ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫామ్​ లో ఉన్న సూర్యకుమార్​ యాదవ్​ను ఫస్ట్​ డౌన్​ లో ఎందుకు దించలేదంటూ వీరేంద్ర సెహ్వాగ్​ ప్రశ్నించారు. సూర్యకుమార్​ ప్లేస్​ లో ఇషాన్ కిషన్​ను దించడంతో అతడు సరిగ్గా ఆడలేకపోయాడు. దీంతో జట్టు పెద్దగా స్కోర్​ చేయలేకపోయింది. మరోవైపు హార్ధిక్​ పాండ్యా, కృనాల్​ పాండ్యా కూడా వెంట వెంటనే అవుట్​ అయ్యారు. 17 బంతులాడిన ఇషాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై పవర్ ప్లేలో 21 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్​ లో ముంబైకి ఇదే అత్యల్ప స్కోరు.

దీనిపై వీరేంద్రసెహ్వాగ్​ స్పందిస్తూ.. ' ముంబై ఇండియన్స్​ జట్టు ఓ తప్పుడు ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఫామ్​ లో ఉన్న సూర్యకుమార్​ను ఫస్ట్​ డౌన్​ లో బ్యాటింగ్​ కు తీసుకురాకపోవడం పెద్ద తప్పు. ఇషాన్ కిషన్​ ప్లేస్​ లో సూర్యకుమార్​ వచ్చి ఉంటే పవర్​ ప్లేలో ముంబై ఎక్కువ పరుగులు సాధించేది. దీంతో ఆఖరున  వచ్చే బ్యాట్స్​మెన్లు ఒత్తిడి లేకుండా ఆడేవాళ్లు. అప్పుడు ముంబై జట్టు కనీసం 150 కంటే ఎక్కువ పరుగులు చేసేది' అంటూ సెహ్వాగ్​ పేర్కొన్నాడు.

సెహ్వాగ్​ అభిప్రాయంతో మరో మాజీ క్రికెటర్​ అజయ్​ జడేజా సైతం ఏకీభవించాడు. ముంబై ఇండియన్స్​ ఓ తప్పుడు ప్రణాళికతో ముందుకెళ్తున్నదని చెప్పాడు. నిన్నటి మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా అంతా విఫలమయ్యారు. దీంతో విమర్శలు వస్తున్నాయి.
Tags:    
  • Rohit Sharma 
  • Mumbai Indians 
  • IPL 2021 
  • Cricket News 
  • Telugu News 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS