• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మూడు రాజధానులు మంచి...

మూడు రాజధానులు మంచి నిర్ణయం ...స్వాగతించిన కర్నూలు ఎంపీ

By - Tupaki Desk
Update: 2019-12-18 06:18 GMT
ఏపీ కి మూడు రాజధానులు..ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద చర్చనీయంశమైంది. అసెంబ్లీ లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సీఎం జగన్‌ పై వైసీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు  టీడీపీ మాత్రం వైసీపీ ప్రభుత్వం పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక్క రాజధానినే కట్టలేకపోతున్నామని.. అలాంటప్పుడు మూడు రాజధానులను ఎలా కడతారని చంద్రబాబు మండిపడ్డారు.

అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదు అని , వికేంద్రీకరణ జరగాలని అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా లాంటి దేశాలలో మూడు రాజధానులు ఉన్నాయని, మనం కూడా మారాలి అని, మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు రావచ్చు అని సీఎం చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక అందిన వెంటనే రాజధాని పై నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అయన ప్రకటించారు.

సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను ముఖ్యంగా ఎంతో కాలంగా రాయలసీమ కోసం పోరాటం సాగిస్తున్న బిజెపి ఎంపీ టీజి వెంకటేష్ స్వాగతించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీజీ వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయని , అయితే కర్నూలులో హైకోర్టు ఒక్కటే కాకుండా అసెంబ్లీ, సచివాలయం కూడా ఉంటే బాగుంటుంది అని అన్నారు.

అలాగే ఇదే సమయంలో కర్నూలులో అసెంబ్లీ, సచివాలయం కూడా ఏర్పాటు చేస్తేనే రాజధానిగా కర్నూల్ కి  అర్థం ఉంటుందని అన్నారు. రాజధానుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. ఇక అంతే కాదు ఈ క్రమంలో జగన్‌ పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలు సరికావన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న తన అభిప్రాయాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యక్తం చేశారు.
Tags:    
  • Amaravathi 
  • Amaravathi News 
  • Andhra News 
  • Amaravathi Startup Developement Area 
  • Ys Jagan 
  • Andhra Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Botsa Satyanarayana 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS