• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు పరువుకు పెద్ద...

చంద్రబాబు పరువుకు పెద్ద పరీక్షేనా ?

By - Tupaki Desk
Update: 2021-10-17 05:09 GMT
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడు ఆశ నెరవేరుతుందో చెప్పలేకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే కుప్పం మున్సిపల్ ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక చంద్రబాబు పరువుకే పెద్ద పరీక్షగా మారబోతోంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ ఎన్నికలతో పాటు కుప్పంకు వివిధ కారణాలతో ఎన్నిక జరగలేదు. అందుకని ప్రత్యేకంగా తొందరలోనే ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. గతంలోనే ఇటు వైసీపీ అటు టీడీపీ ఛైర్మన్ అభ్యర్ధులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీ తరపున డాక్టర్ సుధీర్ ను ఎంపిక చేయగా టీడీపీ త్రిలోక్ ను ప్రకటించింది. 25 వార్డులున్న మున్సిపాలిటిలో వార్డులకు  కౌన్సిలర్లుగా రెండుపార్టీలు ఇంకా పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేదు. ఇందులో 10 వార్డులు మహిళలకు రిజర్వయ్యాయి. మొత్తంమీద వైసీపీ మంచి ఊపుమీదుంది. పంచాయితీ ఎన్నికల్లో అధికారపార్టీ మద్దతుదారులే గెలిచారు. అలాగే పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తాన్ని వైసీపీ స్వీప్ చేసేసింది.

ఈ నేపధ్యంలో తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలో కూడా గెలిచి వైసీపీ తన సత్తాను చాటాలని ఆరాటపడుతోంది. ఇదే సమయంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోయిన పార్టీ పరువును ఎలా తిరిగి సంపాదించుకోవాలా ? అని చంద్రబాబు అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే మూడు రోజుల నియోజకవర్గం పర్యటనను పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోకి వచ్చినా నియోజకవర్గాన్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.

నియోజకవర్గంలో మొత్తం పెత్తనమంతా కొంతమంది నేతలపైనా, అధికారులపైనా వదిలేసిన ఫలితంగానే ఇపుడు చంద్రబాబు కష్టకాలం అనుభవిస్తున్నారు. గడచిన 30 ఏళ్ళుగా పార్టీకి మద్దతుగా నిలబడిన చాలామంది నేతలను చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన ఫలితాన్ని మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికలో ఎదుర్కొన్నారు. రేపటి మున్సిపల్ ఎన్నికలో కూడా టీడీపీ ఓడిపోతే పోయేది చంద్రబాబు పరువే తప్ప పార్టీది కాదని అందరికీ తెలిసిందే.

ఇన్ని ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన పార్టీకి చివరగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితమే వచ్చే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే పూర్తి బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదుంచారు జగన్. దానికి తగ్గట్లుగానే మంత్రి పెద్దిరెడ్డి కూడా చంద్రబాబు ఓడించే విషయమై నూరుశాతం కృషి చేస్తున్నారు. మొత్తానికి తొందరలో జరగబోయే కుప్పం మున్సిపల్ ఎన్నికలే చంద్రబాబు పరువుకు పెద్ద పరీక్షగా మారింది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Tags:    
  • Nara Chandrababu naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS