ఈ సున్నా క‌థ‌ను సారు చూడాల్సిందే!

Update: 2019-04-22 04:10 GMT
సెక్ర‌టేరియ‌ట్ కు వెళ్ల‌రు.. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ‌రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో ఎన్ని రోజులు ఉంటారో.. ఇంచుమించు అన్నే రోజులు ఫాం హౌస్ లో గ‌డిపేస్తార‌న్న పేరున్న కేసీఆర్‌.. అక్క‌డేం చేస్తుంటార‌న్న క్వ‌శ్చ‌న్  కు ఏ ఒక్క‌రూ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక్క‌టైతే నిజం.. కేసీఆర్ మాట‌లు.. ఆయ‌న నిర్ణ‌యాలు చూసిన‌ప్పుడు మాత్రం.. రోటీన్ సీఎంల‌కు భిన్న‌మైన తీరు ఆయ‌న‌లో క‌నిపిస్తుంటుంది.

రోజూ ప‌ని.. ప‌ని అంటూ ప‌రుగులు తీయ‌కుండానే.. ఒక వ్యూహం ప్ర‌కారం ముందుకు వెళ్ల‌టం కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌జ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌లు.. వాటికి పరిష్కారాల‌తో పాటు.. ఊహించేందుకు సైతం భ‌య‌ప‌డేలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తు ఫాంహౌస్ లోనే జ‌రుగుతుంద‌న్న మాట‌ను చెబుతుంటారు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. రెవెన్యూ ఉద్యోగుల‌కు దిమ్మ తిరిగే షాకింగ్ నిర్ణ‌యాన్ని వెలువ‌రించే ద‌మ్ము ఏ సీఎంకైనా ఉంటుందా?  అయినా వెన‌క్కి త‌గ్గ‌కుండా తాను చెప్పింది చేస్తాన‌న్న మొండిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాదు.. వారిని త‌న దారికి తెచ్చుకునేందుకు అనుస‌రిస్తున్న మార్గం చూస్తే.. కేసీఆర్ మామూలోడు కాద‌న్న భావ‌న క‌లుగుతుంది.

ఒక విష‌యాన్ని మొత్తంగా అవ‌గాహ‌న చేసుకోవ‌టం.. అమూలాగ్రం మ‌ధ‌నం చేయ‌ట‌మే కాదు.. దాని ప‌రిష్కారం కోసం ఎంత‌కైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరు కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. రెవెన్యూ శాఖ‌ను మొత్తంగా ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న పంతంతో ఉన్న కేసీఆర్ దృష్టికి ఇంట‌ర్ ప‌రీక్ష‌ల లొల్లి వ‌చ్చిందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇంట‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు వెలువ‌డ‌టం.. మార్కుల విష‌యంలో ఇంట‌ర్ బోర్డు అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌న్న విష‌యం ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల‌తో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  తాజాగా వెలుగుచూసిన ఎగ్జాంఫుల్ కానీ కేసీఆర్ దృష్టికి వెళితే.. ఆయ‌న తాట తీసే ప్రోగ్రాం షురూ చేస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మంచిర్యాల జిల్లా జిన్నారానికి చెందిన న‌వ్య అనే విద్యార్థినికి సెకండ్ ఇయ‌ర్ తెలుగులో సున్నా మార్కులు రావ‌టంతో షాక్ తింది. ఎందుకంటే.. ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ లో  మంచి మార్కులు వ‌చ్చిన న‌వ్య‌కు సెకండ్ ఇయ‌ర్ లో సున్నా మార్కులు వ‌చ్చిన తీరు మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. దీంతో ఆమె పేప‌ర్ ను రీవాల్యుయేష‌న్ చేయ‌గా 99 మార్కులు వ‌చ్చిన‌ట్లు తేలింది.

99 మార్కులు వ‌చ్చిన విద్యార్థినికి తొలుత సున్నా మార్కులు వ‌చ్చాయ‌ని మార్కుల మెమో పంపి.. ఫెయిల్ అయిన‌ట్లుగా పేర్కొన‌టం షాకింగ్ గా మారింది. మీడియాలో వ‌చ్చిన క‌థ‌నానికి స్పందిస్తూ రీవాల్యుయేష‌న్ లో 99 మార్కులు వ‌చ్చిన‌ట్లు తేల‌టం ప‌లువురికి నోట మాట రావ‌టం లేదు.  ఇదే రీతిలో చాలామంది ప‌రిస్థితి ఉంద‌ని.. మార్కుల విష‌యంలో ఇంట‌ర్ బోర్డు దారుణ‌మైన వైఫ‌ల్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంట‌ర్ బోర్డు తీరుపై వేలాది మంది పేరెంట్స్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇలాంటి విష‌యాలు త‌న దృష్టికి వ‌చ్చినంత‌నే చాలా సీరియ‌స్ గా
స్పందించే అల‌వాటు కేసీఆర్ లో ఉంది. మ‌రీ.. జీరో ఎపిసోడ్ సారు దృష్టికి వెళ్లిందా?  లేదా?


Tags:    

Similar News