• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూ.1500కోట్లు ఏమయ్యాయి..?

రూ.1500కోట్లు ఏమయ్యాయి..?

By - Tupaki Desk
Update: 2015-09-02 06:03 GMT
ఆ మధ్యన తెలంగాణ ఖాతాకు చెందిన రూ.1274కోట్లను ఐటీ శాఖ బదలాయించుకోవటం.. దీనిపై తెలంగాణ సర్కారు గళం విప్పి.. వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నించి.. కేంద్రంతో కోట్లాడి మరి.. తన నుంచి తీసుకున్న రూ.1274కోట్ల భారీ మొత్తాన్ని ఎట్టకేలకు తీసుకురాగలిగింది. మూడు నెలల పోరాటం అనంతరం మంగళవారం.. ఈ భారీ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఖాతాలో జమ అయ్యింది.

ఇదిలా ఉంటే.. ఆసక్తికలిగించే అంశం ఒకటుంది. మూడు నెలల కిందట.. రిజర్వ్ బ్యాంకు దగ్గరున్న తెలంగాణ రాష్ట్ర ఖాతాలో రూ.3500 కోట్లు ఉన్నాయి. దీంతో.. తమకు రావాల్సిన బకాయిల్ని తిరిగి తీసుకునేందుకు ఆర్ బీఐ అనుమతితో ఐటీ శాఖ ఈ నిధులను బదలాయించుకోవటం తెలిసిందే. తాజాగా తెలంగాణ సర్కారు ఖాతాలో తాను తీసుకున్న రూ.1274కోట్లను జమ చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఖాతాలో మొత్తంగా ఉన్న నగదు నిల్వ రూ.2వేల కోట్లు మాత్రమేనని చెబుతున్నారు.

అంటే.. మూడు నెలల క్రితం.. ఐటీ శాఖ రూ.1274కోట్లు తీసుకునే సమయంలో తెలంగాణ సర్కారు ఖాతాలో రూ.3500కోట్లు ఉంటే.. తాజాగా మాత్రం ఈ భారీ మొత్తాన్ని వేసిన తర్వాత రూ.2వేల కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే.. మూడు నెలల వ్యవధిలో రూ.1500 కోట్ల నిధుల తరుగుబాటు చోటు చేసుకుందన్న మాట. ఈ విషయాన్ని మరింత సింఫుల్ గా చెప్పాలంటే.. మూడు నెలల క్రితం మీ పర్సులో రూ.వంద ఉన్నాయనుకుంటే.. అందులో చెప్పాపెట్టకుండా యాభై రూపాయిలు మీ స్నేహితుడు తీసుకున్నాడనుకోండి. మీరు వాడిని చడామడా తిట్టేసి.. చివరకు మీ యాభై మీరు తెచ్చేసుకున్నారు. అంటే.. అప్పుడు మీ జేబులో ఉండాల్సింది రూ.వంద.

కానీ.. మీ జేబులో రూ.70 ముత్రమే ఉంటే దాని అర్థం ఏమిటి? మీ జేబులో ఉండే నగదు నిల్వ తగ్గిపోయిందని. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ సర్కారుకు చెందిన ఆర్ బీఐ ఖాతాలో భారీ మొత్తం తరుగు కనిపించటం విశేషం. ఓ పక్క ఏడాపెడా అప్పులు తెస్తూనే.. మరోవైపు ఖాతాలో ఉన్న నగదు ఖర్చు అయిపోవటం చూసినప్పుడు.. నగదు నిల్వపై తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపించదు. ధనిక రాష్ట్రమని తరచూ చెప్పుకోవటం కంటే కూడా ధనిక రాష్ట్రానికి ఉండే ధనబలం తెలంగాణ రాష్ట్రానికి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    
  • Telangana Govt 
  • Telugu news 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS