జగన్ ఎఫెక్ట్.. మహాకూటమికి భారీ షాక్

Update: 2018-10-27 06:39 GMT
తెలుగు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా.. ఇంకా ప్రజలు, నేతలు విడిపోలేదని మరోసారి నిరూపితమైంది. జగన్ పై ఏపీలోని విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగాక ఆయన హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.. ఆస్పత్రిలో జగన్ ఉన్న విషయం తెలుసుకొని  కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి - మాజీ మంత్రులు జానారెడ్డి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - దానం నాగేందర్ తో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆస్పత్రికి - అనంతరం ఇంటికి వచ్చి జగన్ ను పరామర్శించారు.

కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. మహాకూటమిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్న చంద్రబాబు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారట.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు జగన్ ను కలవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టినట్టు తెలిసింది. మహాకూటమిలో తమతో పొత్తు పెట్టుకొని తమ వైరిపక్ష నేతను ఎలా కలుస్తారని ఏపీ టీడీపీ నేతలు కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్నారట..

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమకు రాజకీయ భవిష్యత్ ఇచ్చాడని.. ఆయనపై అభిమానంతోనే జగన్ ను పరామర్శించామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారట.. అసలు పరామర్శిస్తే తప్పేంటి అని వారు వాదిస్తున్నారట..రాజకీయాలకు - వ్యక్తిగత అభిమానులకు ముడిపెట్టవద్దని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారట..
Read more!

అయితే తెలంగాణ రాజకీయాలు ఇక్కడే మలుపు తిరిగే అవకాశాలున్నాయంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ పార్టీ తెలంగాణలో పోటీచేయకున్నా ఖమ్మం సహా పలు నియోజకవర్గాల్లో 10వేల మంది దాకా వైఎస్ వీరాభిమానులున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో వేలమంది గ్రామీణ ప్రజానీకం లబ్ధి పొంది ఆయనకు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ పై చంద్రబాబు కుట్ర రాజకీయాలు చూశాక వారంతా మహాకూటమికి.. అందునా టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట.. ఇది టీఆర్ ఎస్ నెత్తిన పాలు పోసే వ్యవహారమే అంటున్నారు. మొత్తానికి  జగన్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనే కాదు.. తెలంగాణ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News