అమెరికా కలలపై అప్పుల నీడ: ఓపీటీ గందరగోళంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థి

స్టెమ్ ఓపీటీ దరఖాస్తుకు అవసరమైన కీలక పత్రాలను సమర్పించడంలో ఎంప్లాయర్ జాప్యం చేశాడు. దీనవల్ల విద్యార్థి యూనివర్సిటీకీ దరఖాస్తు చేసుకునే సరికి డిసెంబర్ 16 అయ్యింది.;

Update: 2025-12-23 18:09 GMT

అమెరికాలో ఎంప్లాయర్ చేసిన చిన్న నిర్లక్ష్యం ఒక భారతీయ విద్యార్థి జీవితాన్ని అగాధంలోకి నెట్టింది. లక్షల రూపాయల విద్యారుణం.. మరోవైపు వీసా గడువు ముగుస్తుండడం ఆ విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

అసలేం జరిగింది?

వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసిన సదురు విద్యార్థి ప్రస్తుతం ఓపీటీ కింద ఉద్యోగం చేస్తున్నాడు. అతడి ప్రస్తుత వర్క్ పర్మిట్ గడువు డిసెంబర్ 29, 2025 తో ముగియనుంది. నిబంధనల ప్రకారం.. గడువు ముగియక ముందే ‘స్టెమ్ ఓపీటీ’ ఎక్స్ టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం యూనివర్సిటీ నుంచి కొత్త ఐ20 పొందడం అత్యవసరం.

ఎంప్లాయిర్ నిర్లక్ష్యం.. యూనివర్సిటీ నిబంధనలు

స్టెమ్ ఓపీటీ దరఖాస్తుకు అవసరమైన కీలక పత్రాలను సమర్పించడంలో ఎంప్లాయర్ జాప్యం చేశాడు. దీనవల్ల విద్యార్థి యూనివర్సిటీకీ దరఖాస్తు చేసుకునే సరికి డిసెంబర్ 16 అయ్యింది. అయితే వర్జీనియా టెక్ యూనివర్సిటీ అంతర్గత డెడ్ లైన్ డిసెంబర్ 12తోనే ముగిసిపోయింది. గడువు దాటిన తర్వాత దరఖాస్తలన ప్రాసెస్ చేయడం కుదరదని యూనివర్సిటీ స్పష్టం చేయడంతో ఆ విద్యార్థి భవిష్యత్తు అంధకారంలో పడింది.

ఆర్థిక భారం.. మానసిక కుంగబాటు

భారత్ లో భారీ మొత్తంలో ఎడ్యూకేషన్ లోన్ తీసుకున్న ఈ విద్యార్థి.. అమెరికాలో ఉద్యోగం ఉంటేనే ఆ అప్పు తీర్చగలడు. ఒకవేళ వీసా గడువు ముగిసి స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తే అక్కడే వచ్చే తక్కువ జీతంతో అంత పెద్ద మొత్తం అప్పు తీర్చడం అసాధ్యం. ఇది కేవలం కెరీర్ సమస్య మాత్రమే కాదు.. అతడి కుటుంబ ఆర్థిక స్థితిగతులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అప్ డేట్ అయిన ఐ20 లేకుండానే యూఎస్సీఐఎస్ కి దరఖాస్త చేయడం మార్గం ఉంది. అయితే ఇలా చేయడం వల్ల 180 రోజుల పాట తాత్కాలికంగా పని చేసుకునే హక్కు లభిస్తుంది.

విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ ఘటన విదేశీ విద్యార్థులక ఒక గుణపాఠం. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. యూనివర్సిటీ డెడ్ లైన్ కంటే కనీసం 15 రోజుల ముందే డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి. డాక్యుమెంట్ల విషయంలో ఎంప్లాయర్ల వెంట పడి మరీ పని పూర్తి చేసుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఇమిగ్రేషన్ లాయర్ ను సంప్రదించడం మేలు. చివరి నిమిషంలో చేసే పోరాటం కంటే మందే జాగ్రత్తగా ఉండడమే అమెరికాలో స్థిరపడాలనకనే విద్యార్థలకు శ్రీరామరక్ష.

Tags:    

Similar News