కరోనా సోకిందేమో అన్న అనుమానంతో టెక్కీ ఆత్మహత్య..!

Update: 2020-08-17 08:10 GMT
కరోనా మహమ్మారి ..దేశంలో రోజురోజుకి మరింత తీవ్రంగా తయారు అవుతుంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అలాగే మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే, కొంతమంది కరోనా సోకి , దాని నుండి కోలుకోలేక ప్రాణాలు విధిస్తుంటే , మరికొందరు కరోనా లక్షణాలు ఉన్నాయన్న భయంతో  కరోనా వైరస్ మట్టుపెట్టక ముందే ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్య బాగా ఎక్కువైయ్యాయి.  కరోనా వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, మనస్థైర్యంతో ఈ మహమ్మారిని జయించొచ్చని ప్రభుత్వాలు అవగాహన కల్గిస్తున్నారు , వైద్య నిపుణులు చెప్తున్నా  కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడటం విచారించదగ్గ విషయం.

తాజాగా హైదరాబాద్ లో టెక్కీ కరోనా సోకిందేమో అన్న అనుమానంతో ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే  ..  ఆ  యువతి నార్సింగిలోని ఓ బహుళజాతి సంస్థ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంది. అయితే, హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆమె కొద్దిరోజులుగా ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలో , తనకి కరోనా లక్షణాలు ఉన్నాయోమో అన్న భయంతో  ఆమె తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య తరవాత గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా యువతి కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాధమికంగా పోలీసులు నిర్దారించారు. అలాగే , ఆ  సూసైడ్ నోట్ లో తన మృతదేహాన్ని ఎవరూ తాకవద్దని పేర్కొంది. కాగా సమాచారం అందిన పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని ఆదారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News