అబార్షన్​ ఎలా చేయాలో నేర్పిస్తున్నారట! ఆ దేశంలో ఆ వైద్యులే కరవు..

Update: 2020-10-06 02:30 GMT
జర్మనీ లో అబార్షన్​ చేసే వైద్యులే లేరట. ఇందుకు కారణం అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినచట్టాలే. అయితే ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం వైద్యులకు అబార్షన్​ ఎలా చేయాలో నేర్పిస్తున్నదట. దీంతో చాలామంది యువ వైద్యులు అబార్షన్​ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. అబార్షన్​ చేయించుకోవాలంటే ఆ దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఎవరన్నా అబార్షన్​ చేయించుకోవాలంటే ముందుగా ఫ్యామిలీ ప్లానింగ్​ క్లినిక్​కు వెళ్లి కౌన్సెలింగ్​ చేయించుకోవాల్సి ఉంటుంది.  'గర్భస్థ శిశువు సంరక్షణ' కోసం జర్మనీలో కఠినచట్టాలు ఉన్నాయి. మహిళలు అబార్షన్ చేయించుకోకుండా ఆపడానికి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.

మరోవైపు జర్మనీలో డాక్టర్లు తాము అబార్షన్లు చేస్తామని బహిరంగంగా బోర్డులు పెట్టుకోవచ్చు. కానీ వాళ్లు ఎవరికీ అబార్షన్​ చేశారు? అన్న విషయం చెబితే నేరం. దీంతో ఇప్పడు జర్మనీలో అబార్షన్లు చేసే డాక్టర్లు చాలా తక్కువయ్యారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇప్పడు యువ డాక్టర్లకు అబార్షన్ ప్రక్రియ అవగాహన కల్పిస్తున్నారు.  ‘ఛాయిస్ బెర్లిన్’ వైద్య విద్యార్థులు బొప్పాయి (పపయా వర్క్‌షాపుల) పేరుతో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బొప్పాయి పండు స్త్రీ అండాశయాన్ని పోలి ఉండటంతో అందులో ఉండే విత్తనాలను తీసే విధానంలోనే అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. అబార్షన్ ప్రక్రియను వైద్య విద్యార్థులకు నేర్పడమే ఈ వర్క్ షాపులు నిర్వహించడం వెనకనున్న ఉద్దేశం.

ఈ గ్రూపును 2015లో అలీషియా బెయిర్ స్థాపించారు. ఇప్పటి తరం విద్యార్థులెవరికీ అబార్షన్లు ఎలా చేయాలో తెలియడం లేదని అందుకే తాము ఈ గ్రూప్​ను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.  జర్మనీలో గర్భిణులకు ముప్పు వాటిల్లి నప్పుడు సహాయం, సలహాలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని జర్మన్ అసోసియేషన్ అఫ్ గైనకాలజిస్ట్స్ చెప్పింది.  గర్భిణి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మాత్రమే గర్భస్రావం చేయాలని జర్మనీ చట్టాలు చెబుతున్నాయి. జర్మనీలో అబార్షన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. నాజీల పరిపాలనా కాలంలో జర్మనీలో శ్వేత జాతి మహిళకు గర్భస్రావం చేస్తే దానిని నేరంగా పరిగణించి మరణ శిక్ష విధించేవారు. కానీ, ఈ నియమం ఇతర జాతులకు చెందిన ప్రజలకు వర్తించేది కాదు. తరువాత కాలంలో తూర్పు జర్మనీ చట్టాలను సవరించింది.

కానీ, తూర్పు, పశ్చిమ జర్మనీలు ఐక్యమైన తరువాత మళ్లీ పశ్చిమ దేశాల విధానాలే ప్రామాణికాలుగా మారాయి. అబార్షన్లు చట్ట విరుద్ధమని చెప్పే నాజీల కాలం నాటి చట్టాన్ని ఆధారంగా చేసుకుని అబార్షన్ వ్యతిరేకులు డాక్టర్లకు వ్యతిరేకంగా కేసులు కూడా వేశారు. అయితే ప్రస్తుతం జర్మనీలో అబార్షన్లు ఎలా చేయాలో అన్న విషయం కొందమంది వైద్యులకు మాత్రమే తెలుసు.. వారు మరికొన్ని రోజుల్లోనే ఉద్యోగవిరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో యువతకు అబార్షన్ల మీద ఎంతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని అలీషియా బెయిర్ చెప్పారు.
Tags:    

Similar News