'దేశం' పొత్తు పొడుస్తోంది
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పొత్తుల ఎత్తులు ఫలించేందుకు పాచికల వేస్తున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేని చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో దేశంలోని అన్ని పార్టీలతోనూ పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. 2004 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు - దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి దెబ్బకు గింగిరాలు తిరిగారు. ఆ ఎన్నికల్లో తీవ్ర పరాభవంతో అపజయం పాలయ్యారు. దీంతో ఆనాటి పరాభవానికి అటల్ బిహారీ వాజ్ పేయే కారణమంటూ ఆయనని దుమ్మెత్తిపోశారు. ఆ పార్టీతో పొత్తు కారణంగా ముస్లీం మైనార్టీలు పార్టీకి దూరమయ్యారంటూ సూత్రీకరణలు కూడా చేశారు. ఆ తర్వాత మళ్లీ తాను సెక్యులరిస్టుని అని చెప్పుకునేందుకు మళ్లీ కమ్యూనిస్టులతో జత కలిసారు. ఈ సారి కూడా ఆయన కూటమికి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తీసారు. దీంతో చంద్రబాబు నాయుడు ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల్లో విజయం సాధించలేరని చాలా సార్లు రుజువు అయ్యింది.రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుందుకు చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని తన అధికారం కోసం కాంగ్రెస్ తో కలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో బహిరంగంగానూ - ఆంధ్రప్రదేశ్ లోనూ రహస్యంగానూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చకోవాలన్నది చంద్రబాబు నాయుడి వ్యూహం. దీనిని పక్కాగా అమలు చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన రిజర్వుడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల స్ధానాలను కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టాలన్నది చంద్రబాబు నాయుడి వ్యూహం. ఇక్కడ తమ పార్టీకి చెందిన డమ్మీ అభ్యర్ధులను రంగంలో దింపే అవకాశాలున్నాయంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మొత్తం 20 స్ధానాలను - రాయలసీమలో ఒక ఎంపీ స్ధానాన్ని కాంగ్రెస్ కేటాయించే దిశగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు దేనికైనా సమర్ధుడని చెప్పేందుకు ఇదో ఉదాహరణగా మిగలనుంది.