రంగానాడు...ఆమె సెంట్రల్ అట్రాక్షన్
ఇక రంగా నాడు కార్యక్రమానికి అతి పెద్ద అట్రాక్షన్ గా రంగా కుమార్తె ఆశా కిరణ్ ఉంటారని చెబుతున్నారు. ఆమె ఇటీవల గోదావరి జిల్లాలలో జరిగిన కార్తీక వన సమారాధన లో పాల్గొన్నారు.;
రంగా నాడు విశాఖ వేదికగా జరుపుకునేందుకు ముస్తాబు అవుతోంది. మరో రెండు రోజులు మాత్రమే ఈ కార్యక్రమానికి గడువు ఉంది. ఈ నెల 26న సువిశాలమైన ఆర్కే బీచ్ లో నిర్వహించే రంగా నాడు చరిత్రలో నిలిచిపేయే విధంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి వేళ జరిగే రంగా నాడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారబోతోంది అని అంటున్నారు. ఏకంగా లక్షలాది మంది ఆ రోజు జరిగే రంగా నాడుకు తరలి వస్తారు అని అంచనా వేస్తున్నారు.
అందరికీ ఆహ్వానం :
ఇదిలా ఉంటే రంగా నాడు కేవలం రంగా ఆశయాల సాధన కోసమే అని చెబుతున్నారు. ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ కాదని అంటున్నారు. ఇక అన్ని పార్టీలను ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించారు అని అంటున్నారు. అంతే కాదు రంగా ఆశయాలను ఈ సభలో పాల్గొనే వక్తలు అంతా ప్రస్తావిస్తారు అని వాటి ఆచరణ కోసం భవిష్యత్తులో చేయాల్సిన దాని మీద తీర్మానాలు చేస్తారు అని అంటున్నారు.
వంగా కుమార్తెగా :
ఇక రంగా నాడు కార్యక్రమానికి అతి పెద్ద అట్రాక్షన్ గా రంగా కుమార్తె ఆశా కిరణ్ ఉంటారని చెబుతున్నారు. ఆమె ఇటీవల గోదావరి జిల్లాలలో జరిగిన కార్తీక వన సమారాధన లో పాల్గొన్నారు. ఆనాటి నుంచి ఆమె వార్తలలో కనిపిస్తున్నారు. ఆమె రానున్న కాలంలో మరింత చురుకుగా ప్రజా కార్యక్రమాలలో పాల్గొనాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే రంగా ఆశయాల సాధన కోసమే ఈ కార్యక్రమం నిర్వహణ అని చెబుతున్నారు. రంగా రాధా మిత్రమండలితో పాటు అనేక సామాజిక సంస్థలను మళ్ళీ పునరుత్తేజం చేయడానికి ఆమె సిద్ధపడుతున్నారని అందులో మొదటిగా రంగా నాడుని నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.
ఉత్తరాంధ్రా వేదిక :
ఉత్తరాంధ్రా అంటేనే బడుగు బలహీన వర్గాలకు కేంద్రంగా ఉంటుంది. నూటికి ఎనభై శాతం బీసీలు ఉన్న ప్రాంతం ఇది. అంతే కాదు విశాఖ నగరం తప్పించి రూరల్ విజయనగరం శ్రీకాకుళం లో ఉన్న తూర్పు కాపులు అంతా బీసీలుగానే ఉంటారు. అలా చూస్తే బీసీలుగా ఉన్న కాపులు అత్యధికంగా ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల తరువాత ఉత్తరాంధ్రా లో బలమైన కాపు సామాజిక వర్గం ఉంది. అలాంటి చోట విశాఖ కేంద్రంగా సాగర తీరంలో జరిగే రంగా నాడులో రంగా కుమార్తె ఆశా కిరణ్ ఏమి మాట్లాడుతారు అన్నదే ఇపుడు అంతటా ఉత్కంఠంగా ఉంది. ఆమె తాను ఏ రాజకీయ పార్టీ వైపు చూడడం లేదని ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. అంతే కాదు ఆమె తాను తన తండ్రి రంగా ఆశయాల కోసమే ప్రజా జీవితంలోకి వస్తున్నాను అని అంటున్నారు. మరి 26 న జరిగే రంగా నాడుకు వచ్చే స్పందన తరలి వచ్చే లక్షలాది జనం వారి సమక్షంలో ఆమె చేసే ప్రసంగం ఇవన్నీ కూడా పూర్తిగా విశ్లేషించుకుంటేనే తప్ప ఏపీ రాజకీయాల్లో జరిగే కొత్త పరిణామాలు ఏమిటి అన్నది తెలియదు అంటున్నారు.