ఇండియా, చైనా.. జెన్-జెడ్ అప్పులు వేటికోసం చేస్తున్నారంటే.. !

అవును... 2025 ప్రథమార్థంలో భారతదేశంలో 27% వ్యక్తిగత రుణాలు ప్రయాణాల కోసం తీసుకోబడ్డాయని.. ఇది దేశ ఆర్థిక చరిత్రలో తొలిసారని.. ఇది జెన్-జెడ్ లో రుణ ప్రవర్తనలో కీలక మార్పును సూచిస్తుందని అహుజా అన్నారు.;

Update: 2025-12-24 00:30 GMT

భారతీయ జెన్-జెడ్ యువతకు, చైనాలోని జెన్-జెడ్ యువతకు అప్పులు, ఆనందాలు, ఆదాల్లో ఉన్న వ్యత్యాసాన్ని వెల్లడిచేస్తూ ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్, రచయిత సార్థక్ అహుజా లింక్డ్ ఇన్ పోస్టులో ఈ విషయం వెల్లడించారు. ఇందులో భాగంగా.. 2025 ఫస్ట్ హాఫ్ లో భారత్ లో జెన్-జెడ్ 27% పర్సనల్ లోన్స్ టూర్స్ కోసం తీసుకోబడ్డాయని వెల్లడించారు.

అవును... 2025 ప్రథమార్థంలో భారతదేశంలో 27% వ్యక్తిగత రుణాలు ప్రయాణాల కోసం తీసుకోబడ్డాయని.. ఇది దేశ ఆర్థిక చరిత్రలో తొలిసారని.. ఇది జెన్-జెడ్ లో రుణ ప్రవర్తనలో కీలక మార్పును సూచిస్తుందని అహుజా అన్నారు. పర్సనల్ లోన్ తీసుకోవడానికి నంబర్ వన్ కారణం.. మెడికల్ ఎమర్జెన్సీ, హౌస్ రెన్నోవేషన్ లేదా ఆస్తి కొనడం కానేకాదని.. ‘ప్రయాణించడం’ అని అహుజా తన పోస్టులో రాశారు.

వాస్తవానికి ముపటి తరాలు సాధారణంగా నిత్యావసరాలు లేద దీర్ఘకాలిక ఆసుల కోసం అప్పులు తీసుకున్నారని.. కానీ జెన్-జెడ్ లెక్కే వేరని.. స్టేటస్ డ్రివెన్ కన్జంప్షన్ అని పిలిచే దానికోసం నిధులు సమకూర్చడానికి క్రెడిట్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అహుజా తెలిపారు. ఇందులో ప్రధానంగా.. ఖరీదైన ఈవెంట్లకు వెళ్లడానికి విమాన ఖర్చులు సమకూర్చుకోవడం, ఈఎంఐలో ఐఫోన్ లను కొనుగోలు చేయడం ఉన్నాయని అన్నారు.

అయితే ఈ ధోరణి మెట్రో నగరాలకే పరిమితం కాలేదు సుమా.. టైర్-2, టైర్-3 నగరాల నుంచి కూడా యువత ఈ విషయంలో ముందుకు వస్తున్నరని చెబుతున్నారు. వీరందరికీ అగ్ర గమ్యస్థానాలుగా గోవా, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లు ఉన్నాయని.. ఇదే సమయంలో ఆగ్నేసియాలోని పలు దేశాలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ఇదే క్రమంలో.. రుణగ్రహీతలు తరచుగా రూ.1 లక్ష వరకూ చిన్న రుణ మొత్తాలను ఈఎంఐ లతో ఇష్టపడుతున్నారని చెబుతున్నారు .

ఈ క్రమంలో.. 2015 - 2019 మధ్య చైనా యువత కూడా స్టేటస్ కొనుగోళ్ల కోసం ఇదే విధమైన దూకుడుగా రుణాలు తీసుకున్నారని.. అయితే.. కోవిడ్ మహమ్మారి ఎంట్రీ తర్వాత వారిలో పెను మార్పులు సంభవించాయని.. ఆ తరం ఖర్చు నుంచి పొదుపుకు పారిపోయిందని అహుజా రాశారు. ఈ క్రమంలో.. చైనాలో బంగారం.. ప్రధానంగా కేవలం ఒక గ్రాము బరువున్న 'బంగారం గింజలు' యువ పొదుపుదారుల్లో కొత్త హోదా చిహ్నంగా మారిందని తెలిపారు.

అంటే... రేపు సంపాదిస్తాను కాబట్టి ఈరోజే అప్పు చేయాలని భారతీయులు ఆలోచిస్తుండగా.. రేపు నాకు ఉద్యోగం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజే నేను పొదుపు చేస్తాను అని చైనీయులు ఆలోచిస్తున్నారని అహుజా అన్నారు.

Tags:    

Similar News