పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన టీడీపీ ఎమ్మెల్సీ

Update: 2020-05-18 03:30 GMT
లాక్‌డౌన్ వేళ ఇంటికి ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పురుషులు కాల‌క్షేపంగా పేకాట ఆడుతూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. అయితే పేకాట ఆడ‌టం నేరం. కానీ ప్ర‌జ‌లు విస్మ‌రించి ఆడుతూనే ఉంటారు. ప్ర‌జ‌ల వ‌ర‌కు అయితే ఓకే కానీ ఏకంగా ప్ర‌జాప్ర‌తినిధి బ‌హిరంగంగా పేకాట ఆడుతూ దొరికి పోయాడు. ఆయ‌నే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథ్‌రెడ్డి. పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు. ఈ ఘ‌ట‌న వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో జ‌రిగింది.

గ్రామంలో పేకాట ఆడుతున్నారని ఆదివారం పోలీసుల‌కు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి దాడులు నిర్వహించారు. ఈ క్ర‌మంలో పేకాట ఆడుతున్న వారిని గుర్తించి ప‌ట్టుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్‌ రెడ్డి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.15,700 స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్ర‌జాప్ర‌తినిధి అయి ఉండి పేకాట ఆడ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పేకాట శిబిరాలను ప్రోత్స‌హించ‌డం స‌రికాద‌ని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News