అంబులెన్స్‌లో రొమాన్స్! వైరల్ వీడియో
అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.;
అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రోగులను ఆసుపత్రికి తరలించాల్సిన వాహనంలో ఏకంగా మద్యం పార్టీతోపాటు శృంగార కార్యకలాపాలు సాగించడం సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అంబులెన్స్ లో ఒక యువతితోపాటు ఇద్దరు యువకులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురు అసభ్యకరంగా అంబులెన్స్ లో గడుపుతుండటాన్ని స్థానికులు గుర్తించారు.
ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఒక అంబులెన్స్‌ను ఓయో హోటల్ గదిలా మార్చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు పక్కన అంబులెన్స్‌ను ఆపిన సిబ్బంది లోపల రొమాన్స్ కి సిద్ధమయ్యారని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న అంబులెన్స్ లో అసాధరణ కదలికలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందోనన్న ఆసక్తితో అంబులెన్స్ కిటికీ నుంచి చూడగా వారికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయని అంటున్నారు. అంబులెన్స్ లో ఎవరైనా రోగి అత్యావసర పరిస్థితి ఎదుర్కొంటున్నాడేమోనని అనుమానంతో వెళ్లిచూశామని, అవసరమైతే వైద్య సిబ్బందికి సహకరిద్దామని భావించామని కానీ అక్కడికి వెళ్లి చూశాక ఊహించని షాక్ ఎదురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
అంబులెన్స్ లో ఒక యువతితోపాటు ఇద్దరు యువకులు అనుచితంగా ప్రవర్తించడం కనిపించిందని స్థానికులు అధికారులకు ఫిర్యాదుచేశారు. తాము ఈ విషయమై నిలదీసే సరికి అంబులెన్స్ ను అక్కడి నుంచి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. అయితే కొందరు అంబులెన్స్ ను 5 కి.మీ. మేర వెంబడించి అడ్డుకున్నారు. లోపల ఉన్నవారిని బయటకి దింపి ప్రశ్నించారు. అనంతరం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, అంబులెన్స్ లోపల మద్యం సీసాలు ఉండటమే కాకుండా, కొన్ని రొమాన్స్ దృశ్యాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల కోసం కేటాయించిన స్ట్రెచర్‌ను ఇలాంటి పనులకు ఉపయోగించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. అంబులెన్స్ ను దుర్వినియోగం చేసిన డ్రైవర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.