టీడీపీ ఎమ్మెల్యేను కరివేపాకులా తీసేశారే..?
ఇది దసరా.. అంటే అమ్మ వారి పండుగ.. దుర్గాదేవీ ప్రతిరూపాలైన అమ్మవాళ్ల దేవాలయాల్లో పట్టవస్త్రాలు, అలంకారాలు, శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా అదే సందడి నెలకొంది. అంతా సిద్ధమైంది. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ మాత్రం ఈసారి వివాదాస్పదమైంది. ప్రోటోకాల్ వివాదంతో తనను పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే బోండా ఉమ అలిగి వెళ్లిపోయారు.
విజయవాడ దుర్గ గుడిలో టీటీడీ పట్టువస్త్రాల సమర్పణను బోండా ఉమ వివాదాస్పదం చేశారు. యథా ప్రకారం టీటీడీ నుంచి ఏఈవో సాయిలు పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ కూడా వచ్చారు. అయితే ప్రోటో కాల్ ప్రకారం టీటీడీనుంచి వచ్చిన ఏఈవోకు దుర్గగుడి సిబ్బంది స్వాగతం పలికి తలపాగా కట్టారు. ఇదే పట్టువస్త్రాల సమర్పణకు వచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమకు ఇది ఆగ్రహానికి గురిచేసింది..