• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీడీపీ నేత పట్టాభి...

టీడీపీ నేత పట్టాభి అరెస్ట్

By - Tupaki Desk
Update: 2021-10-21 02:44 GMT
టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో పట్టాభిపై కేసులు నమోదు చేశారు. పట్టాభిపై 120బీ, 505,504 సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పట్టాభి సతీమణి చంద్ర అన్నారు. తనకు పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు. తలుపులు బద్దలుగొట్టి మరీ ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్షన్‌ 120 బి కింద పట్టాభిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిని ఇంతవరకూ అరెస్ట్‌ చేయలేదని తెలిపారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేస్తారని పనిగట్టిన టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు భారీ చేరుకున్నారు. మీడియా, కార్యకర్తలను బలవంతంగా పోలీసులు బయటికి పంపించి పట్టాభిని అరెస్ట్ చేశారు. పట్టాభి అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఖండించారు.

అరెస్ట్‌కు ముందు పట్టాభి ఓ వీడియో సందేశం ఇచ్చారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆ వీడియోలో తెలిపారు. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని వీడియోలు చూపించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు నమ్మకం ఉందని పట్టాభి తెలిపారు. ప్రస్తుతం పట్టాభి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టాభి నివాసంలోని సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, డీవీఆర్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టాభి ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి.


Tags:    
  • TDP 
  • Political News 
  • Latest News 
  • Chandrababu 
  • Telugu Desam Party leaders 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS