వైసీపీ పథకానికి మాజీ సీఎం కిరణ్ పేరట.. టీడీపీ వింత డిమాండ్

Update: 2020-07-15 17:30 GMT
ఉమ్మడి ఏపీ ఉన్న రోజులవీ.. సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారు.అయితే తాజాగా ఇదే పథకానికి జగన్ సర్కార్ పేరు మార్చి ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణం’గా మార్చేసింది. అధికారం మారినప్పుడు పథకాల పేర్లు మారడం అత్యంత సహజం..

మొన్నటిదాకా ఎన్టీఆర్, చంద్రన్న పేర్లపై పథకాలుండేవి.. ఇప్పుడు వైఎస్ఆర్, జగనన్న పేర్లు వచ్చేశాయి. అయితే తాజాగా ఈ పథకంపై టీడీపీ చేసిన డిమాండ్ విచిత్రంగా ఉంది. ఈ డిమాండ్ పై వైసీపీ నేతలు ఒకింత షాక్ కు గురవుతున్నారు.

ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పలు నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే అందరూ హర్షిస్తారు. ప్రతిపక్షంగా విమర్శించడంలో తప్పేమీ లేదు. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి పేరుతోనే ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ పథకాన్ని అమలు చేయాలని ఏకంగా టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేయడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇలా టీడీపీ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం పేరును వైసీపీ పథకానికి పెట్టమని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. దీన్ని బట్టే టీడీపీ-కాంగ్రెస్ బంధం బయటపడిందంటున్నారు.
Tags:    

Similar News