ఏపీ టీడీపీ జిల్లా అధ్య‌క్షులు వీరే..

Update: 2017-06-18 10:48 GMT
ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఐవీఆర్ ఎస్ విధానంలో స‌ర్వేలు చేసి కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు తీసుకుని ఆ ఫ‌లితాల ఆధారంగా జిల్లాలకు పార్టీ అధ్యక్ష - కార్యదర్శులను ఎంపిక చేసిన‌ట్లు తెలుగుదేశం వ‌ర్గాలు చెప్తున్నాయి.

విశాఖ అర్బన్: వాసుపల్లి గణేష్

విశాఖ రూరల్‌: పంచకర్ల రమేష్‌ బాబు

తూర్పు గోదావరి: నామన రాంబాబు

పశ్చిమ గోదావరి:  తోట సీతరామలక్ష్మి

విజయనగరం-మహంతి చిన్నమనాయుడు

శ్రీకాకుళం-గౌతు శిరీష

కృష్ణా: బచ్చుల అర్జునుడు

గుంటూరు: జీవీఎస్‌ ఆంజనేయులు

ప్రకాశం: దామచర్ల జనార్దన్

నెల్లూరు: బీదా రవిచంద్ర

చిత్తూరు: పులివర్తి మణిప్రసాద్

కడప: శ్రీనివాస్‌రెడ్డి

అనంతపురం-బీకే పార్థసారథి

కర్నూలు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కాగా క‌ర్నూలు జిల్లాలో ఇంత‌వ‌ర‌కు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి పార్టీ అధ్య‌క్షుడిగా ఉండేవారు. అయితే, ఆయ‌న సోద‌రుడు శిల్పా మోహ‌న్ రెడ్డి ఇటీవ‌లే వైసీపీలో చేర‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చ‌క్ర‌పాణి రెడ్డి కూడా పార్టీలో కొన‌సాగుతారా లేదా అన్న‌ది అనుమానంగానే ఉండ‌డంతో క‌ర్నూలు జిల్లాకు ఆయ‌న పేరు ప‌రిశీలించ‌లేద‌ని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News