వైరల్... ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల ఫ్లాట్స్!

అవును... తమ సంస్థ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోన్న ఉద్యోగుల విషయంలో ఒక చైనీస్ ఆటోమేటివ్ టెక్నాలజీ సంస్థ చాలా విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది.;

Update: 2025-12-22 12:30 GMT

సాధారణంగా దసరాకో, దీపావళికో, క్రిస్మస్ కో, న్యూ ఇయర్ కో పలు సంస్థలు ఉద్యోగులకు బోనస్ లో, బహుమతులో ఇస్తుంటాయి. అందులో స్వీట్ బాక్స్ నుంచి కార్ల వరకూ ఉంటుంటాయి. కొన్ని పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగులకు ఆ ఛాన్స్ కూడా ఉండదు పాపం..! వారి సంగతి అలా ఉంచితే తాజాగా చైనీస్ ఆటోమేటివ్ టెక్నాలజీ సంస్థ విభన్నంగా ఆలోచించింది. తమ సంస్థలోని ఉద్యోగులకు ఏకంగా సొంత ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.

అవును... తమ సంస్థ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోన్న ఉద్యోగుల విషయంలో ఒక చైనీస్ ఆటోమేటివ్ టెక్నాలజీ సంస్థ చాలా విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా.. జెజియాంగ్ గుషెంగ్ ఆటోమేటివ్ టెక్నాలజీ సంస్థ తన అత్యంత విశ్వసనీయ ఉద్యోగులలో కొంతమందికి.. ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికోసం మూడేళ్ల కాలంలో సుదీర్ఘ సేవలందించిన 18 మంది ఉద్యోగులను ప్రత్యేకంగా ఎంపిక చేసింది.

ఈ ఇళ్ల విలువ రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్... పని కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఉద్యోగులు ఎదుర్కొనే వాస్తవాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ గృహనిర్మాణ కార్యక్రమాన్ని రూపిందించినట్లు చెప్పరు. ఇలా నెలవారీ ఇచ్చే జీతం చెక్కును మించిన స్థిరత్వాన్ని అందించాలనే ఈ ఫ్లాట్ అలోకేషన్ పథకం ఉద్దేశించబడిందని తెలిపారు.

ఈ క్రమంలో... ఈ ఏడాది తాము ఐదు ఫ్లాట్ లను పంపిణీ చేస్తామని.. వచ్చే ఏడాది మరో ఎనిమిదింటిని కేటాయించాలని ప్లాన్ చేస్తున్నామని.. మొత్తం మీద మూడేళ్లలో ఈ మొత్తం 18 ఫ్లాట్ లను అందించాలని ప్లాన్ చేస్తునట్లు వాంగ్ తెలిపారు. ఈ ఫ్లాట్లన్నీ కంపెనీ పారిశ్రామిక స్థావరం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయని.. అందువల రోజువారీ ప్రయాణ సమస్య కూడా తగ్గుతుందని.. ఉద్యోగుల పని, జీవిత లాజిస్టిక్స్ సులభతరం అవుతుందని అన్నారు.

కాగా... జెజియాంగ్ గుయేషెంగ్ ఆటోమేటివ్ టెక్నాలజీ అనేది చిన్న స్టార్ట్ కాదు సుమా.. ఈ కంపెనీలో సుమారు 450 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ క్రమంలో 2024లో సుమారు 70 మిలియన్ డాలర్ల అవుట్ పుట్ విలువను నమోదు చేసినట్లు నివేదించబడింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే.. ఫ్లాట్ అందుకున్న తర్వాత ఉద్యోగులు కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేయాలి.. ఆ తర్వాత ఆ ఇల్లు అధికారికంగా వారికి బదిలీ చేయబడుతుంది.

Tags:    

Similar News