వైసీపీ లీడర్ గంగులతో తారకరత్న భేటీ!

Update: 2020-10-11 04:45 GMT
నందమూరి కథానాయకుడు తారకరత్న ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని కలవడం చర్చనీయాంశం అయ్యింది. గంగుల కుటుంబం ఇప్పుడు వైసీపీలో ఉండగా వారిని  నందమూరి వారసుడు కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తారకరత్న కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆయన తెరపై కనిపించి  చాలా కాలమైంది. ప్రస్తుతం మళ్ళీ ఆయన  ఓ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం గండికోటలో జరుగుతోంది. అక్కడ చిత్రీకరణ పూర్తవడంతో తారకరత్న జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు గిరిధర్‌రెడ్డితో కలసి హైదరాబాద్‌కు బయలు దేరారు.

మార్గమధ్యంలో తారకరత్న ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిని, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని  వారి  నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం  గంగుల కుటుంబం వైసీపీలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తారకరత్న ఆ కుటుంబాన్ని కలవడం ప్రత్యేకత సంతరించుకుంది. అయితే తారకరత్న వారిని కలవడానికి  ప్రత్యేకమైన కారణాలేమీ లేవని తెలుస్తోంది. గతంలో గంగుల ఫ్యామిలీ టీడీపీలో చాలా కాలం పాటు  క్రియాశీలకంగా పని చేసింది. ఆ అనుబంధంతోనే తారకరత్న వారితో భేటీ అయ్యాడని సమాచారం.
Tags:    

Similar News