• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణ గవర్నర్ బదిలీ.....

తెలంగాణ గవర్నర్ బదిలీ.. మహారాష్ట్రకు తమిళిసై

By - Tupaki Desk
Update: 2023-01-09 10:24 GMT
తెలంగాణ ఫుల్ ఫోకస్ పెట్టిన కేంద్రంలోని బీజేపీ ఇక్కడ రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ ను గద్దెదించేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టవద్దని డిసైడ్ అయ్యింది. గొడవలతో ముదిరిపాకాన పడ్డ తెలంగాణ గవర్నర్ తమిళిసై వర్సెస్ కేసీఆర్ వివాదాన్ని తెగదెంచాలని చూస్తోంది. తమిళిసైకి కేసీఆర్ ఏ విధంగా సహకరించడం లేదని తెలియడంతో ఎలాగైనా కేసీఆర్ ను దెబ్బకొట్టడానికి ప్రత్యామ్మాయ నేత కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు త్వరలో కొత్త గవర్నర్ ను తీసుకురావాలని చూస్తున్నట్టు సమాచారం. మరి గవర్నర్ మార్పునకు కారణం ఏంటి? ఎందుకు మార్చాలని కేంద్రం చూస్తోంది? వచ్చే ఎన్నికల కోసమేనా? అన్న చర్చ మొదలైంది.

తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నట్టు సమాచారం. తమిళిసైని మహారాష్ట్రకు బదిలీ చేయాలని చూస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని కూడా తమిళిసై చాలా రోజులుగా చూస్తున్నారు.  

తెలంగాణ ప్రభుత్వంతో గొడవ పెట్టుకొని మూడేళ్లుగా గౌరవం లేకుండా తమిళి సై ఉంటున్నారు. అనేక అవమానాలు పాలవుతున్నారు. కేసీఆర్ ఏ విషయంలోనూ తమిళిసైకి ప్రొటోకాల్ ఇవ్వడం లేదు.  తెలంగాణ అధికారులు పట్టించుకోవడం లేదు. కేంద్రంతో బీఆర్ఎస్ రాజకీయ వైరంతో గవర్నర్ తమిళిసై కూడా కేసీఆర్ కు యాంటీగా మారారు.

ఇక మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ తనను బాధ్యతల నుంచి తప్పించాలని.. తాను పబ్లిక్ లైఫ్ నుంచి తప్పుకొని ప్రశాంత జీవితం గడపాలని చూస్తున్నట్టు కేంద్రానికి తెలిపాడు. దీంతో ఆయనకు విశ్రాంతినిచ్చి ఆ స్తానంలో తమిళిసైను నియమించే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో తమిళిసైకి ఊరట లభించనుంది.

తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తారని.. ఉత్తరాదికి చెందిన నేతలను పంపిస్తారని సమాచారం. లేదంటే దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలను అయినా నియమిస్తారని తెలుస్తోంది.

రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి తర్వాత ప్రధాని మోడీ.. అటు ప్రభుత్వ పరంగానూ.. ఇటు పార్టీలో సంస్థాగతంలో పలు మార్పులు చేయాలని భావిస్తున్నట్టు బీజేపీ కేంద్ర కార్యాలయం సమాచారం.

ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే చోట కీలకమైన వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలని కేంద్రం చూస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణగవర్నర్ ను మార్చడానికి సమాయత్తమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Telangana 
  • Governer 
  • TamiliSaiSoundrajan 
  • Maharashtra 
  • Politics 
  • CentralGovernment 
  • PoliticalNews 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS