పళనిస్వామిపై సంచలన ఆరోపణలు చేసిన తమిళ్ ‌సెల్వన్ !

Update: 2020-10-19 12:10 GMT
తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకి సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ కూడా విజయమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఇప్పటికే పక్కా వ్యూహ రచనతో కీలక పార్టీలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా డీఎంకే .. ఎడీఎంకే మధ్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని ఎడిఎంకే ప్రయత్నాలు చేస్తుంటే , ఈసారి తమిళనాడుకి కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటూ స్టాలిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దీనితో ఇప్పటి నుండే ఒకరిపై ఒకరు ఆరోపణలు , విమర్శలు చేసుకోవడం మొదలెట్టేశారు.

తాజాగా డీఎంకే నేత , ఎడప్పాడి పళనిస్వామి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అన్నాడీ ఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యేందుకు .. ఎడప్పాడి పళనిస్వామి , పన్నీర్‌ సెల్వం కు భారీగా నగదు ముట్టజెప్పారని, దాన్ని దాచేందుకే ఓపీఎస్‌ కుమారుడు, ఎంపీ రవీంద్రనాథ్‌ మారిషస్ ‌కు వెళ్లాడని డీఎంకే తేని నార్త్‌ జిల్లా ఇన్‌చార్జి తంగ తమిళ్ ‌సెల్వన్‌ సంచలన ఆరోపణలు చేశారు. తేనిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తంగ తమిళ్‌ సెల్వన్‌ మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కు ఒక శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే హవా వీస్తుందన్నారు. పార్టీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారన్నారు.

అలాగే , అదే సమయంలో ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. స్టాలిన్ ‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తేని జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాలను డీఎంకే కైవసం చేసుకుంటుందని, ఇక్కడ డిప్యూటీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని తంగ తమిళ్‌ సెల్వం ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News