లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్... ఏపీలో ఆ పథకాల నిధుల విడుదలకు బ్రేక్..!

అవును... ఎలక్షన్ కోడ్ రావడానికి ముందే వైఎస్సార్ ఆసరా, విద్యాదీవెన పథకాలకు జగన్ బటన్ నొక్కారని.. ఈ క్రమంలో... సుమారు 70 శాతం మంది ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయని

Update: 2024-05-06 15:30 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ఊహించని పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో పలు సంక్షేమ పథకాల అమలుకు ఈసీ బ్రేక్ వేసింది! దీంతో... ఫీజు రీయెంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలు నిలిచిపోయాయి!! దీంతో... చంద్రబాబు వల్లే ఈ పథకాలకు ఈసీ అభ్యంతరం తెలుపుతుందని కామెంట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు!

అవును... ఎలక్షన్ కోడ్ రావడానికి ముందే వైఎస్సార్ ఆసరా, విద్యాదీవెన పథకాలకు జగన్ బటన్ నొక్కారని.. ఈ క్రమంలో... సుమారు 70 శాతం మంది ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయని.. మిగిలిన వారి ఖాతాల్లోకి జమ అవుతున్న సమయంలోనే ఈ బ్రేక్ ఎందుకని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు! ఈ క్రమంలోనే... టీడీపీ ఫిర్యాదుల కారణంగానే నిధుల విడుదలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపాలని ఈసీ ఆదేశించిందని అంటున్నారు!

దీంతో... చంద్రబాబు పేదలపై పగపట్టారనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి! మొన్నటి మొన్న వృద్దులకు, వికలాంగులకు పెన్షన్లు ఇంటివద్ద అందకుండా చేసిన పాపం చంద్రబాబు ఖాతాలోనే వేస్తూ.. బ్యాంకుల వద్ద క్యూలైన్లో ఉన్న వృద్ధులు శాపనార్ధాలు పెడుతున్నారంటూ కథనాలు వచ్చాయి.. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి!

ఇదే క్రమంలో తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు అందకుండా చంద్రబాబు & కో ఈసీకి ఫిర్యాదులు చేసి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అనే విమర్శలు తెరపైకి తెస్తున్నారు! దీనివల్ల తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఇప్పుడు సమస్య వచ్చింది!

Read more!

ఇదే క్రమంలో... ఖరీఫ్ కు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ కూడా నిలిచిపోయింది! అదేవిధంగా... విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు నిలిచిపోయాయి. దీంతో... ఆ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు లబోదిబో మంటున్నారని అంటున్నారు! ఈ నేపథ్యంలో... మొన్న పెన్షన్స్ తరహాలోనే ఈ పాపం కూడా చంద్రబాబు ఖాతాలోనే వేస్తూ శాపనార్ధాలు పెడుతున్నారని సమాచారం!

ఈ నేపథ్యంలో ఈ విషయాలపై ఏపీ సీఎం వైఎస్ స్పందించారు.. ఆవేదన వ్యక్తం చేశారు! ఇందులో భాగంగా... “ఈ నెల పేదలకు అందాల్సిన సంక్షేమ పధకాలు అడ్డుకున్న పెత్తందారుడు చంద్రబాబు” అని మొదలుపెట్టిన జగన్... చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లోమీడియా అంతా కలిసి ఎన్నికల కమిషన్‌ పై ఒత్తిడి తెచ్చి.. బటన్ నొక్కిన పథకాలకు విడుదల చేయాల్సిన నిధులు కూడా ఆపుతున్నారని ఫైర్ అయ్యారు!

దీంతో... నిన్న పెన్షన్ దారులకు ఎలాగైతే చంద్రబాబు శత్రువుగా మారారో.. ఇప్పుడు ఫీజు రీయెంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాల లబ్ధిదారుల జీవితాల్లోనూ విలన్ అవుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!

Tags:    

Similar News