శివ 'మొగ్గు' ఎవరికి ?!

వీరిద్దరి మధ్యన బీజేపీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ బహిష్కృత నేత, మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్ప పోటీలో ఉన్నాడు.

Update: 2024-05-06 17:30 GMT

అక్కడ ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల వారసులే బరిలో ఉన్నారు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ రాఘవేంద్ర, మరొకరు మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు, హీరో శివరాజ్ కుమార్ సతీమణి గీతా రాజ్ కుమార్. వీరిద్దరి మధ్యన బీజేపీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ బహిష్కృత నేత, మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్ప పోటీలో ఉన్నాడు.

శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం 2009కి ముందు వరకు మాజీ ముఖ్యమంత్రి ‌ బంగారప్పకు కంచుకోట. ఆయన అక్కడి నుండి నాలుగుసార్లు విజయం సాధించారు. 2009లో యెడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర అరంగేట్రం చేసి తన కోటగా మార్చుకున్నాడు. అప్పటి నుండి బంగారప్ప కుటుంబం వరసగా ఓడిపోతుంది.

2009లో మాజీ ముఖ్యమంత్రి బంగారప్పపై 50 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన రాఘవేంద్ర, 2014లో మందునాథ్ బండారిపై దాదాపు 4 లక్షల మెజారిటీతో గెలిచాడు. 2019 లో మధు బంగారప్పపై 2 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచాడు.

ఈ నేపథ్యంలో నాలుగోసారి గెలిచి తన పట్టు నిలుపుకోవాలన్న పట్టుదలతో రాఘవేంద్ర ఉండగా, కూలిన కోటను వశపరచుకోవాలి బంగారప్ప కుటుంబ శ్రమిస్తున్నాడు. అయితే బీజేపీ రెబల్‌ అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప.. రాఘవేంద్ర ఓట్లు చీల్చే అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నిక రాఘవేంద్రకు క్లిష్టతరంగా మారింది.

Tags:    

Similar News