థియేటర్ల సమస్యపై ఏపీ మంత్రులతో మాట్లాడతా: తలసాని
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు మరియు థియేటర్ల సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అంశం మీద ఇప్పటికే సినీ ప్రముఖులు ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల మీద ఏర్పాటు చేసిన కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని సినిమా జనాలు భావిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ఏపీలో థియేటర్ల సమస్యపై తాను మాట్లాడతానని కీలక వ్యాఖ్యలు చేశారు.
హన్సికా మొత్వానీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ''అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుంది. ఇటీవల పలు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. చలన చిత్ర పరిశ్రమ మీద కొన్ని లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే ఈ మధ్య తెలంగాణలో టికెట్ రేట్లు పెంచడం జరిగింది. చిన్న సినిమాలు - సందేశాత్మక చిత్రాలను దృష్టిలో పెట్టుకొని థియేటర్లలో ఐదో షోకు కూడా పర్మిషన్ ఇచ్చాం'' అని తలసాని అన్నారు.
''తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. సినిమాకు కులం, మతం, ప్రాంతాలు ఉండవు. సినిమా ప్రజలకు వినోదాన్ని అందిస్తుంది. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతాను'' తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పుకొచ్చారు.
ఏపీలో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులు - రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. సినిమా టికెట్ దరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు కమిటీ నివేదికను బట్టి ఫైనల్ డెసిజన్ తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ సమస్యలపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణ మంత్రి మాట్లాడతానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.