తైవాన్ పార్లమెంట్ లో తన్నుకున్న ఎంపీ లు..పంది - గొడ్డు మాంసం దిగుమతి పై నిరసన
తైవాన్ ఇటీవల అమెరికాతో చేసుకున్న ఆర్థిక ఒప్పందంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అమెరికా నుంచి ఆ దేశానికి పంది, గొడ్డు మాంసం దిగుమతి అవుతుంది. అయితే ఇప్పటివరకు ఆ దేశంలో పంది, గొడ్డుమాంసం దిగుమతిపై నిషేధం ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో ఈ నిషేధం తొలగిపోయింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఈ విషయంపై పార్లమెంట్లో చర్చ జరిగింది. అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
తైవాన్ పార్లమెంట్ లో దిగుమతి కి సంబంధించిన నివేదికను సెంగ్ చాంగ్ చదువుతుండగా.. ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాంసం ముద్దలను విసిరి పడేసారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే అధికారపార్టీ సభ్యులు కూడా తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరికొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. పరస్పరం దాడులు చేసుకున్నారు.
అమెరికాతో చేసుకున్న ఒప్పందంపై మరోవైపు తైవాన్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. నిన్న పార్లమెంట్లోనే నిరసన జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అంతర్జాతీయంగా ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వివాదంపై ఇంతవరకు అగ్రదేశం స్పందించలేదు.