• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జ‌య‌మ్మ స్ట్రాట‌జీ.....

జ‌య‌మ్మ స్ట్రాట‌జీ.. క‌విత‌క్క‌కు సూట‌య్యేనా?!

| తన మనసులో మాట.. అంటూ కొత్తగా తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్‌) పార్టీని ప్రారంభించిన కవిత కీలక ప్రకటన చేశారు.

By - Garuda Media
Update: 2026-04-25 15:30 GMT

తన మనసులో మాట.. అంటూ కొత్తగా తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్‌) పార్టీని ప్రారంభించిన కవిత కీలక ప్రకటన చేశారు. అదే `తెలంగాణ తల్లి`గా తాను ఉండాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సహజంగా ఇది తమిళనాడులో మాత్రమే చెల్లింది. అక్కడ ఉమ్మడి పార్టీ అంటే ద్రవిడ పార్టీ నుంచి అన్న డీఎంకే విడిపోయినప్పుడు.. ఎంజీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత(జ‌య‌మ్మ‌) తనకంటూ ఒక సొంత కుంపటిని ఏర్పాటు చేసుకునే క్రమంలో తమిళ ప్రజలకు తల్లిగా పరిచయమయ్యారు.

ఇలాగే ఆవిడ కూడా తనను తల్లిగా భావించాలని కోరుకున్నారు. తమిళనాడు ప్రజలు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే.. ఆవిడ నటిగా తమిళ ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. అప్పటికే వందలాది సినిమాల్లో ఆమె నటించారు. తమిళ ప్రజలను ఆకట్టుకున్నారు. కాబట్టి ఆమెను తల్లిగా భావించారు. అది సక్సెస్ అయింది. ఇప్పటికీ జయలలిత విగ్రహాలతో ఆలయాలు కట్టిన గ్రామాలు కూడా ఉన్నాయి తమిళనాడులో.

కానీ ఆ పరిస్థితి కవితకు వస్తుందా.. ఆమె కామె అనుకుంటే తల్లిగా రిసీవ్ అవుతారా.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణ సమాజం ఒక విభిన్నమైన ఆలోచనతో ఉంటుంది. సెంటిమెంటు అంటే అది వ్యక్తిగత సెంటిమెంటు కంటే కూడా సమాజ సెంటిమెంటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రజలు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఒక ఘటనను తీసుకుంటే.. కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు.

ఇంతలో ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో ఆయన దీక్ష విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సమాజం తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇంక తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ దీక్షను కొనసాగించారు. అటువంటి సెంటిమెంటు ఉన్న తెలంగాణలో `నేను అమ్మ‌`ని అని పరిచయం చేసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ సమాజం ఏ మేరకు దీన్ని ఆహ్వానిస్తుంది అనేది ప్రశ్న.

ఇప్పటివరకు కవిత అంటే కెసిఆర్ కుమార్తె గానే చూశారు. ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్సీగా ఒక రాజకీయ నాయకురాలుగా ఒక జాగృతి అధ్యక్షురాలుగా చూశారే తప్ప అకస్మాత్తుగా `నేను అమ్మ`ని అని ఆవిడ చెప్పినంత మాత్రాన తెలంగాణ సమాజం ఆ రకంగా రిసీవ్ చేసుకోవడం కష్ట సాధ్యం. అంతేకాదు ఆవిడ చెప్పినంత తేలికగా తెలంగాణ సమాజం కవితను అమ్మగా చూసే పరిస్థితి కూడా ఉండదు. ఎవరికి ఉండే అంచనాలు వారికి ఉంటాయి తప్పేమీ కాదు. కానీ.. ఎక్కువగా ఊహించుకుంటేనే ప్రమాదం. ఈ విషయంలో కవిత ఆలోచించుకుని అడుగులు వేయడం ఉత్తమమ‌ని పరిశీలకులు చెబుతున్నారు.

Tags:    
  • kavitha 
  • telanganapolitics 
  • kcr 
  • jayalalithaa 
  • indianpolitics 
  • trs 
  • kavithakalvakuntla 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS