జేసీ సోదరుల పై తాడిపత్రి నాయకుడి సంచలన ఆరోపణలు
అనంతపురంలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసు మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ కేసుకు సంబంధించిన విషయంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కి కూడా పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు తాడిపత్రికి చెందిన నాయకుడు కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి, అతడి సోదరుల విషయంలో పలు సంచలన విషయాలు ఆయన బయటపెట్టారు.
పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర చాలా ఉంది అని సంచలన ఆరోపణలు చేశారు. హత్యకు ఉపయోగించిన తుపాకులు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సరఫరా చేశారని తెలిపారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో లభ్యమైన రివాల్వర్ కూడా జేసీ ఇచ్చిందేనని, తాను జేసీ వద్ద చాలాకాలం పనిచేసినట్లు వివరించారు. పరిటాల రవి హత్యలో జేసీ పాత్రపై విచారించాలని గతంలో మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి కొండన్న పోలీసులకు ఫిర్యాదు చేశారని మురళీ ప్రసాద్ రెడ్డి గుర్తుచేశారు. అనంతపురం జిల్లా లో జేసీ దివాకర్ రెడ్డి క్రిమినల్ రాజకీయాలు రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఈ విషయం పై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
దీంతో పాటు త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ లీజు రద్దు పై స్పందించారు. లీజు రద్దు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు జేసీకి లేదని స్పష్టం చేశారు. త్రిసుల్ కంపెనీ విషయంలో జేసీ సోదరులు పలు మోసాలు, అక్రమాలు చేశారని తెలిపారు. ఈ విషయంలో తనకు బెదిరింపులు వచ్చాయని మురళీ ప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.