బీజేపీ విస్తరణ.. జిల్లాకో ఫార్ములా.. !
వీరిలో ప్రధానంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పలు జిల్లాల ఇంచార్జ్‌లుగా జిల్లా అధ్యక్షులుగా కమ్మ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను నియమించడం గమనార్హం.
ఏపీలో బీజేపీ విస్తరణ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. కూటమి ప్రభుత్వంలోనే ఉన్నప్పటికీ..తమకంటూ ప్రత్యేకే పంథాను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. తాజాగా జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను అప్పగించారు. అయితే.. ఈ క్రమంలో జిల్లాకో విధంగా స్ట్రాటజీని అమలు చేసినట్టు స్పష్టమవుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త జిల్లా ఇన్‌ఛార్జిలను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, బూత్ కమిటీల బలోపేతం, సంస్థాగత విస్తరణ, సభ్యత్వ నమోదు, ప్రజా సమ స్యలపై ఉద్యమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, పార్టీ కార్యక్రమాల సమన్వయం వంటి బాధ్యతలను జిల్లా ఇన్ ఛార్జిలు నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, వివిధ మోర్చాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్దేశించారు. అయితే.. ఈ క్రమంలో జిల్లాకు ఒక ప్రాతిపదికను తీసుకుని నాయకులను నియమించడం గమనార్హం. మెజారిటీ నాయకులను ఎలాంటి సిఫారసులు లేకుండా నియమించారు.
వీరి లో ప్రధానంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పలు జిల్లాల ఇంచార్జ్‌లుగా జిల్లా అధ్యక్షులుగా కమ్మ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను నియమించడం గమనార్హం. తద్వారా ఆయా సామాజిక వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. గతంలో ఇలాంటి స్ట్రాటజీ పార్టీ అవలంబించలే దు.సంస్థాగతంగా పార్టీలో సేవలు చేసిన వారికి, ఆర్ ఎస్ ఎస్ భావజాలం పుణికి పుచ్చుకున్నవారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, ఈ దఫా ఈ విషయాన్ని లైట్‌తీసుకుని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియామకాలు చేపట్టినట్టు స్పష్టమవుతోంది.
అదే విధంగా కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన వారికి బాధ్యతలుఅప్పగించడం వెనుక ఆయా జిల్లాల్లో సామాజిక వర్గాల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రయత్నంగానే భావిస్తున్నారు. మరోవైపు.. కేంద్రం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను, ప్రధాని మోడీ హవాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. సీమలో మెజారిటీ రెడ్డి, కురబ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కూర్పు వెనుక గతానికి భిన్నంగా ప్రస్తుత ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే జరిగినట్టు భావిస్తున్నారు. తద్వారా పార్టీని సొంతగా డెవలప్ చేయాలన్న అధిష్టానం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.