భార్యపై అనుమానం.. భర్త ఏం చేశాడో తెలుసా?

Update: 2021-07-01 08:30 GMT
పెళ్లంటే న‌మ్మ‌కం. ఆ బంధం ఎంత ప‌టిష్టంగా ఉంద‌న్న‌ది న‌మ్మకం మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంది. అది స‌న్న‌గిల్లిన వివాహ బంధం.. చెల్లాచెదురై పోతుంది. క‌ల‌త‌లు, క‌ల‌హాల‌తో మొద‌లై.. ఊహించ‌ని దారుణాల వ‌ర‌కూ తీసుకెళ్తుంది. ఇలాంటి ఓ ఘ‌ట‌నే రాజ‌స్థాన్లో వెలుగు చూసింది. భార్య‌పై అనుమానంతో ఓ భ‌ర్త అమానుష చ‌ర్య‌కు పూనుకున్నాడు.

ప్ర‌తాప్ గ‌ఢ్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తికి త‌న భార్య మ‌రొక‌రితో వివాహేత‌ర బంధం కొన‌సాగిస్తోంద‌నే అనుమానం పెంచుకున్నాడు. త‌ర‌చూ ఆమె పుట్టింటికి వెళ్తుండ‌డంతో.. త‌ప్పు చేసేందుకే వెళ్తోంద‌ని అనుమానించసాగాడు. ఈ విష‌య‌మై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ జ‌రుగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో వివాదం మ‌రింత ముదిరడంతో.. ఆమెను బంధించాడు భ‌ర్త‌.

బరువైన గొలును ఆమె కాళ్ల‌కు క‌ట్టేసి తాళం వేశాడు. ఈ విధంగా ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా మూడు నెల‌లుగా బంధించాడు. తాను పుట్టింటికి వెళ్లేది కేవ‌లం వృద్ధురాలైన త‌ల్లికి సేవ చేసేందుకేన‌ని చెప్పినా.. భ‌ర్త వినిపించుకోలేదు. త‌న క్రూర‌త్వాన్ని య‌థావిధిగా కొన‌సాగించాడు.

చాలా రోజులుగా ఈ ప‌రిస్థితిని చూస్తున్న ఇరుగుపొరుగు వారు.. ఈ విష‌యాన్ని పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలికి విముక్తి క‌ల్పించారు. భార్య‌ను హింసించినందుకు భ‌ర్త‌ను అరెస్టు చేశారు.
Tags:    

Similar News