• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బద్వేల్ లో బీజేపీ కి...

బద్వేల్ లో బీజేపీ కి సురేష్ బలం...?

By - Tupaki Desk
Update: 2021-10-07 06:03 GMT
బీజేపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి డిసైడ్ అయింది. కుటుంబ రాజకీయాలను తాము అసలు ఒప్పుకోమని చెబుతూ బీజేపీ పోరులో ముందుకు వచ్చింది. బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేయడానికి కీలక నేతనే ఎంపిక చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న పుంతల సురేష్ ని ఆ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. రైల్వే కోడూరుకు చెందిన సురేష్ ప్రస్తుతం బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన దాదాపుగా పద్నాలుగేళ్ల పాటు ఏపీలో ఏబీవీపీ తరఫున పనిచేశారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన సురేష్ అభ్యర్ధిత్వం  తమకు అన్ని విధాలుగా కలసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

ఇక బీజేపీ ఒక జాతీయ పార్టీగా అన్ని ఎన్నికల్లో పాల్గొంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే తాము పోటీలో ఉన్నామని కూడా అంటున్నారు. ఇక బద్వేల్ లో ఎవరు పోటీలో ఉన్నా కూడా వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధ గెలుపు ఖాయమే అని అంటున్నారు. అయితే బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నదే ఇక్కడ చర్చ. నిజానికి బద్వేల్ లో బీజేపీ 2009 ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే 1415 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో సింగమల వెంకటేశ్వర్లు పోటీ చేశారు. ఇక 2014 ఎన్నికల వేళ చూస్తే టీడీపీతో పొత్తున్న కారణంగా బీజేపీ పోటీ పెట్టలేదు.

అలాగే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి బద్వేల్ లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మరి ఇపుడు ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నదే చర్చ. నిజానికి టీడీపీ పోటీ చేయడంలేదు. మరో వైపు జనసేన కూడా బరి లో నుంచి తప్పుకుంది. దాంతో ఈ రెండు పార్టీల ఓటు బ్యాంక్ మీదనే ఆధారపడి బీజేపీ రేసులో ఉంది అంటున్నారు. మరి ఒకనాడు టీడీపీకి చెందిన వారే ఇపుడు బీజేపీలో ఉన్నారు.  రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కానీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కానీ బీజేపీకి టీడీపీ ఓట్ల నుంచి ఎంత మేరకు వేయించగలరు అన్నదే చూడాలి. ఇక జనసేన రేసులో లేదు. ఆ పార్టీ అభిమానులు కానీ క్యాడర్ కానీ ఓటేస్తే కచ్చితంగా బీజేపీకే అన్న ఆశ కూడా కమలనాధుల్లో ఉందిట. మొత్తానికి సురేష్ ని ముందు పెట్టి బద్వేల్ ఉప ఎన్నిక ద్వారా తన ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది.
Tags:    
  • Congress party 
  • congress trap 
  • badvel 
  • badvel bypolls 
  • andhra pradesh 
  • Badvel bypoll 
  • Suresh 
  • Bjp party 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS