ఓటీటీ బూతుపురాణంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
కరోనా కల్లోలంతో సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదల కావడం.. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లకు జనాలు అలవాటు పడడం.. అందులో జుగుప్సాకర క్రైం, సెక్స్ సీన్లు విచ్చలవిడిగా ఉండడం.. వాటికి సెన్సార్, నియంత్రణ లేకపోవడంతో యువత పెడదారిపడుతోంది. సమాజం ఇలాంటి అశృంఖలత్వాన్ని భరించలేకపోతోంది. ఈ పరిణామాలపై కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కగా తాజాగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ చూస్తే ఏకంగా పోర్న్ కంటెంట్ ను కూడా ప్రసారం చేస్తున్నాయని.. దీనిపై నియంత్రణ అవసరమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోర్న్ కంటెంట్ నియంత్రణకు ఒక యంత్రాంగం అంటూ తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో కంటెంట్ నియంత్రణపై ఇటీవల కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను శుక్రవారంలోగా కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రసారమవుతున్న 'తాండవ్' సినిమా వివాదానికి సంబంధించి దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ తాజాగా విచారణ చేపట్టింది. సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆమెజాన్ ప్రైమ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇండియా చీఫ్ అపర్ణ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అపర్ణ బెయిల్ పిటీషన్ పై శుక్రవారం విచారణ జరుగనుంది. అది తిరస్కరిస్తే ఆమెతోపాటు అమెజాన్ టీమ్ సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే అమెజాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు బుధవారం బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.